KTR : జాతీయ అవార్డు గెలుపొందిన గేయ రచయిత కాసర్ల శ్యామ్ (Kasarla Shyam), ‘బలగం’ బృందానికి కేటీఆర్ (KTR ) అభినందనలు తెలిపారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజానీకం గర్వపడే క్షణమిది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నారు. శ్యామ్ రాసిన ఊరూ పల్లెటూరు పాట గ్రామీణ వాతావరణాన్ని కళ్లకు కట్టినట్టు చూపిస్తుందని, బలగం సినిమాలో పల్లెటూరి జీవితాన్ని చాలా అందంగా చూపించారని కేటీఆర్ తెలిపారు. ఈ పాట కుటుంబాల మధ్య అనుబంధాలు ప్రతిబించించేలా ఉందని, మానవ సంబంధాలను, తరాల మధ్య నెలకొన్న దూరాలను తగ్గించేలా చాలా చక్కగా రాశారని కేటీఆర్ అన్నారు.
హాస్య నటుడిగా రాణిస్తూనే మెగా ఫోన్ అందుకున్న యెల్దండి వేణు (Y.Venu) దర్శకత్వంలో వచ్చిన బలగం సినిమా ఎంత పెద్ద హిట్టో తెలిసిందే. తాత చివరి కోరిక, పిట్టకు పెట్టడం.. డబ్బు ఆశకు తోడు స్వార్ధంతో మానవ సంబంధాలు దెబ్బతింటున్న విధానాన్ని ఈ సినిమాలో ఆద్యంతం హృద్యంగా ఆవిష్కరించారు డైరెక్టర్ వేణు. తెలంగాణ యాస, భాషకు పట్టం కడుతూ తెరకెక్కిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్గా నిలిచింది. 2023 ఏడాదికి ప్రకటించిన 71వ జాతీయ అవార్డుల్లో ఊరూ పల్లెటూరు పాటకు ‘ఉత్తమ సాహిత్యం’ విభాగంలో అవార్డు వచ్చింది. కాసర్ల శ్యామ్ రచించిన ఈ గేయాన్ని మంగ్లీ (Mangli) ఆలపించింది.
71వ జాతీయ చలన చిత్రోత్సవాల్లో భాగంగా ఉత్తమ గేయ రచయితగా బలగం చిత్రంలోని ఊరు పల్లెటూరు… పాటకు గాను కాసర్ల శ్యామ్ అవార్డ్ దక్కించుకున్నారు.#Balagam #KasarlaShyam#NationalFilmAwards2025 pic.twitter.com/df3DuZOpmQ
— PIB in Telangana 🇮🇳 (@PIBHyderabad) August 1, 2025