Krishnam Raju as Paramahamsa | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా రాధేశ్యామ్ కోసం ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. సాహో తర్వాత ప్రభాస్ నటిస్తున్న సినిమా ఇది. అలాగే.. బాహుబలి, సాహో తర్వాత చాలా గ్యాప్ రావడంతో ప్రభాస్ సినిమా కోసం ఎంతో ఆతృతగా అభిమానులు ఎదురు చూస్తున్నారు.
దాదాపు మూడేళ్లు కష్టపడితే రాధేశ్యామ్ షూటింగ్ పూర్తయింది. ఇప్పటికే విడుదలైన సినిమా ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్, సాంగ్స్.. ప్రభాస్ అభిమానులను అలరిస్తున్నాయి. యూట్యూబ్లో మోస్ట్ వ్యూస్ సాధించాయి.
ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా 10 భాషల్లో విడుదల చేస్తున్నారు. జనవరి 14న ఈ సినిమా విడుదల కానుంది. ప్రభాస్ సరసన రాధేశ్యామ్లో పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది. అయితే.. ఈ సినిమాలో రెబల్ స్టార్ కృష్ణంరాజు ఒక ముఖ్య పాత్రలో నటించారు.
రెబల్ స్టార్ కృష్ణంరాజు పరమహంసగా ఈ సినిమాలో నటించారు. కృష్ణంరాజు పాత్ర సినిమా కథనే మలుపు తిప్పుతుందట. అంతటి పవర్ఫుల్ క్యారెక్టర్లో కృష్ణంరాజు నటించినట్టు తెలుస్తోంది.
ఆయన ఫస్ట్ లుక్ చూస్తే కూడా అలాగే ఉంది. ఒక స్వామీజీ అవతారంలో ఉన్న కృష్ణంరాజు.. జపం చేసుకుంటూ కనిపించారు.
Introducing The Legendary Actor, Rebel Star Dr. @uvkrishnamraju garu as #Paramahamsa from #RadheShyam.#Prabhas @hegdepooja @director_radhaa @prabhakaranjustin @UV_Creations @TSeries @GopiKrishnaMvs @AAFilmsIndia @RadheShyamFilm #RadheShyamTrailerOnDec23 pic.twitter.com/l294vVnTmf
— UV Creations (@UV_Creations) December 20, 2021
ప్రభాస్.. తన పెదనాన్న కృష్ణంరాజుతో కలిసి ఇప్పటి వరకు రెండు సినిమాల్లో నటించాడు. ఇది మూడో సినిమా. గతంలో బిల్లా, రెబల్ సినిమాల్లో ఇద్దరూ కలిసి నటించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Hema Malini: రోడ్లను తన బుగ్గలతో పోల్చడాన్ని తప్పుపట్టిన హేమమాలిని
Hamsa Nandini: నటి హంసానందినికి బ్రెస్ట్ క్యాన్సర్.. కోలుకుని తిరిగొస్తానంటూ ధీమా