Samantha Praises Allu Arjun | ‘పుష్ప’లో అల్లు అర్జున్ నటనకు ఫిదా అయిపోయా.. సమంత ఇన్‌స్టా పోస్ట్ వైరల్
Samantha Praises Allu Arjun | ఇక.. ఈసినిమాకు అల్లు అర్జున్ తర్వాత.. ఊ అంటావా మావా.. ఊఊ అంటావా అంటూ సినీ అభిమానులను ఉర్రూతలూగించింది. ఐటెమ్ సాంగ్‌లో అదరగొట్టేసింది
Samantha Praises Allu Arjun | ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో మార్మోగిపోతున్న పేరు పుష్ప. ఈ సినిమా గత శుక్రవారం రిలీజ్ అయి హిట్ టాక్ తెచ్చుకుంది. ఇప్పటికీ థియేటర్లలో బన్నీ అభిమనాలు కోలాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మికా మందన్న నటించింది. పుష్ఫరాజ్‌గా అల్లు అర్జున్ అద్భుతంగా నటించాడని అందరూ బన్నీని ఆకాశానికెత్తుతున్నారు.

ఇక.. ఈసినిమాకు అల్లు అర్జున్ తర్వాత.. ఊ అంటావా మావా.. ఊఊ అంటావా అంటూ సినీ అభిమానులను ఉర్రూతలూగించింది. ఐటెమ్ సాంగ్‌లో అదరగొట్టేసింది. అయితే.. పుష్ప సినిమా చూసిన తర్వాత సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది. అల్లు అర్జున్ గురించి ఆ పోస్ట్‌లో ప్రస్తావించింది. ఆ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Samantha Praises Allu Arjun | అల్లు అర్జున్ను ప్రశంసల్లో ముంచెత్తిన సమంత
సినిమా చూసిన తర్వాత సమంత.. అల్లు అర్జున్ నటనపై పోస్ట్ పెట్టింది. ఇది అల్లుఅర్జున్ను అభినందించే పోస్ట్. అందరినీ కట్టిపడేసే నటన అది. సాధారణంగా నేను ఒక నటుడు అద్భుతంగా నటిస్తే వాళ్ల నటన నుంచి స్ఫూర్తి పొందుతాను. ఈ సినిమాలో నాకు అదే జరిగింది. అల్లు అర్జున్ నటనకు ఫిదా అయిపోయా. అల్లు అర్జున్ నుంచి ఎంతో నేర్చుకున్నా. ముఖ్యంగా బన్నీ మ్యానరిజమ్స్ ఈ సినిమాకే హైలెట్. భుజాలకు పైకి ఎత్తడం దగ్గర్నుంచి.. ప్రతి ఒక్క సీన్ అదిరిపోయింది.. నిజంగా ఎంతో ప్రేరణ కలిగించారు.. అంటూ సమంత.. అల్లు అర్జున్ను ఆకాశానికెత్తింది.

తను పోస్ట్ చేసిన వెంటనే.. అల్లు అర్జున్.. రిప్లయి కూడా ఇచ్చేశాడు. మీ మనసులో నుంచి వచ్చిన కాంప్లిమెంట్స్‌కు ధన్యవాదాలు. మీ మాటలు నా హృదయాన్ని తాకాయి.. అని బన్నీ రిప్లయి ఇచ్చాడు.
బన్నీ నటనపై సమంత చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో బన్నీతో పాటు.. నీ డ్యాన్స్ కూడా అదుర్స్ సామ్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Hema Malini: రోడ్లను తన బుగ్గలతో పోల్చడాన్ని తప్పుపట్టిన హేమమాలిని
Hamsa Nandini: నటి హంసానందినికి బ్రెస్ట్ క్యాన్సర్.. కోలుకుని తిరిగొస్తానంటూ ధీమా
పనామా పేపర్ లీక్ కేసు.. ఐశ్వర్యారాయ్‌కి ఈడీ నోటీసులు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

