న్యూఢిల్లీ : కర్ణాటకలోని ఆంథ్రోపిక్ కంపెనీ అదే పేరున్న అమెరికాలోని ఏఐ సంస్థ ఆంథ్రోపిక్పై ఫిర్యాదు చేసింది. అమెరికా సంస్థ ట్రేడ్ మార్క్ ఉల్లంఘనకు పాల్పడటంతో తమ సంస్థ గౌరవం, వాణిజ్యంపై తీవ్రంగా ప్రభావం చూపుతున్నదని, తమ వినియోగదారులు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారని పేర్కొన్నది.
తమ ముందు ఫిబ్రవరి 16న హాజరు కావాలంటూ బెళగావి కోర్టు జారీ చేసిన ఆదేశాలను అమెరికా కంపెనీ పట్టించుకోలేదు. దీంతో మార్చి 9న తమ ముందు హాజరు కావాలని తాజాగా సంస్థకు కోర్టు సమన్లు జారీ చేసింది. అమెరికా ఆంథ్రోపిక్ భారత్లో బ్రాంచీలను తెరువడంతో ఈ గొడవ వచ్చింది.