టోక్యో : జపాన్ ప్రధానిగా తకైచీ తిరిగి ఎన్నికయ్యారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో తకైచీకి చెందిన లిబరల్ డెమోక్రటిక్ పార్టీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో ఆ దేశ పార్లమెంట్ బుధవారం ఆమెను ప్రధానిగా అధికారికంగా ఎన్నుకున్నది.
జపాన్ తొలి మహిళా ప్రధానిగా గత అక్టోబర్లో ఎన్నికైన తకైచీ, మధ్యంతర ఎన్నికలకు వెళ్లిన విషయం విదితమే. గతవారం వెలువడిన ఫలితాల్లో ఆమె పార్టీ అఖండ విజయం సాధించింది. గత క్యాబినెట్ సభ్యులందరినీ ఈ సారి కూడా ఆమె కొనసాగించే అవకాశం ఉన్నది. దిగువ సభలో ఆమె పార్టీకి స్పష్టమైన మెజారిటీ దక్కడంతో విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో ఆమెకు మరింత స్వేచ్ఛ లభించనున్నది.