Krishna Vamshi | టాలీవుడ్లో క్రియేటివ్ డైరెక్టర్‌గా తనకంటూ స్పెషల్ ఐడెంటిటీ సొంతం చేసుకున్నాడు కృష్ణవంశీ. ఒకానొక టైంలో బ్యాక్ టు బ్యాక్ సక్సెస్‌లతో ఇండస్ట్రీని షేక్ చేసిన ఈ టాలెంటెడ్ డైరెక్టర్ చాలా కాలంగా మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నాడని తెలిసిందే. ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్, రొమాంటిక్ డ్రామాలను తెరకెక్కించడంలో కృష్ణవంశీ రూటే సెఫరేట్ అనడంలో ఎలాంటి సందేహం లేదు.అయితే కృష్ణవంశీ చివరగా డైరెక్ట్ చేసిన రంగమార్తాండ బాక్సాఫీస్ వద్ద నిరాశనే మిగిల్చింది.
ప్రతీ దర్శకుడి ప్రయాణంలో హిట్టు, ఫ్లాపులుంటాయి. మళ్లీ ట్రాక్‌పైకి వచ్చేందుకు నానా తంటాలు పడుతుంటారు. ఇప్పుడలాంటి పరిస్థితే కృష్ణవంశీ ఎదుర్కొంటున్నాడంటూ నెట్టింట ఆసక్తికర చర్చ నడుస్తోంది. కృష్ణవంశీ తాజాగా‘ప్రొడ్యూసర్స్..?’అంటూ తాజాగా ఎక్స్‌లో ట్వీట్ చేసి హాట్ టాపిక్‌గా నిలిచాడు. కృష్ణవంశీకి నిర్మాతలు దొరకడం లేదని ఈ ట్వీట్‌తో హింట్ ఇచ్చినట్టు అర్థమవుతుంది.
బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులను మూటగట్టుకున్న కృష్ణవంశీ తాను సిద్దం చేసిన ఉత్తమ స్క్రిప్ట్‌ను తెరకెక్కించే సరైన నిర్మాతను వెతకడంలో కృష్ణవంశీ ఫెయిలయ్యాడని తాజా ట్వీట్ చెప్పకనే చెబుతోంది. ఏ పాపులర్ ప్రొడ్యూసర్ కూడా కృష్ణవంశీ కథను తీయడానికి సిద్దంగా లేరని తెలిసిపోతుంది.
అయితే ఫ్లాపులతో సంబంధం తన ట్రేడ్ మార్క్ స్టైల్ సినిమా చేయాలంటే కృష్ణవంశీకి ఎప్పుడూ మద్దతుగా నిలుస్తున్నారు మూవీ లవర్స్, ఫాలోవర్స్. కానీ సరైన కథ ఉన్నా నిర్మాతలు దొరకడం కష్టంగా ఉందని తాజా ట్వీట్ క్లారిటీ ఇచ్చేస్తుంది. ఇదిలా ఉంటే U&I Studios కృష్ణవంశీ ట్వీట్‌కు స్పందిస్తూ.. మీ బలాలకు అనుగుణంగా పనిచేస్తామని నమ్ముతున్న మాకు ఒక్క అవకాశమివ్వాలని కోరుతున్నామని రీట్వీట్ చేసింది. మరి కృష్ణవంశీ వారికి ఏదైనా అవకాశమిస్తాడేమో చూడాలి.
Producer ????? https://t.co/S0YRQvPYV6
— Krishna Vamsi (@director_kv) January 17, 2026