దివంగత నటుడు కోట శ్రీనివాసరావు ఇంట మరో విషాదం నెలకొన్నది. ఆయన సతీమణి రుక్మిణి సోమవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్నారామె. జూలై 13న కోట శ్రీనివాసరావు స్వర్గస్తులైన విషయం తెలిసిందే. ఆ విషాదం మరువక ముందే కోట సతీమణి కూడా మృతి చెందటంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదానికి లోనయ్యారు.
బిజీ కెరీర్ కారణంగా కుటుంబాన్ని తాను పెద్దగా పట్టించుకోలేకపోయానని, ఈ రోజు తన సంతానం ఉన్నత విద్యలను అభ్యసించి, బుద్ధిమంతులు కావడానికి తన భార్య రుక్మిణే కారణమని, తనకు ఓర్పు ఎక్కువని, తాను నటించిన చిత్రాల్లో ‘అహనా పెళ్లంట’ అంటే తన భార్యకు ఎంతో ఇష్టమని కోట ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. రుక్మిణి మరణం పట్ల పలువురు చిత్రరంగ ప్రముఖులు సంతాపం వెలిబుచ్చారు.