కేజేఆర్, ‘కోర్ట్’ఫేం శ్రీదేవి జంటగా రూపొందుతున్న ద్విభాషా చిత్రం సోమవారం ఉదయం చెన్నైలో పూజా కార్యక్రమాలతో మొదలైంది. ‘మార్క్ ఆంటోనీ’ చిత్రాన్ని నిర్మించిన మినీ స్టూడియో సంస్థ తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నది. రెగన్ స్టానిస్లాన్ దర్శకునిగా పరిచయం అవుతున్నారు. చిత్రీకరణ త్వరలోనే మొదలుకానుంది.
తెలుగులో ఈ చిత్రాన్ని గంగా ఎంటైర్టెన్మెంట్స్ సంస్థ విడుదల చేస్తున్నది. అర్జున్ అశోకన్, సింగం పులి, జయప్రకాష్, హరీష్ కుమార్, పృధ్వీరాజ్, ఇందుమతి, అశ్విని, కె.కుమార్, అభిషేక్ జోసెఫ్ జార్జ్, అజువర్గీస్, శ్రీకాంత్ మురళి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: పి.వి.శంకర్, సంగీతం: జిబ్రాన్, నిర్మాత: ఎస్.వినోద్‌కుమార్.