Kiran abbavaram | వినూత్న కథతో వస్తున్న కిరణ్ అబ్బవరం.. ఆకట్టుకుంటున్న ‘వినరో భాగ్యము విష్ణు కథ’ ఫస్ట్‌లుక్
విభిన్న మైన కథలను ఎంచుకునే నటులలో కిరణ్ అబ్బవరం ఒకడు. 'రాజావారు రాణిగారు' సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కిరణ్ మొదటి సినిమాతో మంచి విజయం అందుకున్నాడు. తర్వాత వచ్చి
Kiran abbavaram | విభిన్న మైన కథలను ఎంచుకునే నటులలో కిరణ్ అబ్బవరం ఒకడు. ‘రాజావారు రాణిగారు’ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కిరణ్ మొదటి సినిమాతో మంచి విజయం అందుకున్నాడు. తర్వాత వచ్చిన ‘SR.కళ్యాణమండపం’ కరోనా సెకండ్ వేవ్ తర్వాత హిట్టయిన మొదటి సినిమాగా రికార్డు సృష్టించింది. ఇక ఇటీవలే కిరణ్ సెబాస్టియన్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం మొదటిరోజు నుంచే డివైడ్ టాక్ తెచ్చుకుని ఫ్లాప్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈయన నటిస్తున్న మూడు సినిమాలు సెట్స్ పైన ఉన్నాయి. అందులో ‘వినరో భాగ్యము విష్ణు కథ’ ఒకటి. మురళి కిషోర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. శ్రీరామనవమీ సందర్భంగా ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు.
లేటెస్ట్గా విడుదలైన ఫస్ట్‌లుక్‌లో దేవస్థానం ముందు కిరణ్, చేతిలో సన్నాయి పట్టుకొని గంగిరెద్దు పక్కన నిల్చున్నట్లు పోస్టర్లో ఉంది. ఈ చిత్రాన్ని అల్లుఅరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీవాసు నిర్మిస్తున్నాడు. ‘నర్తనశాల’ ఫేం కాశ్మీరా హీరోయిన్గా నటిస్తుంది. చైతన్య భరద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఇదే ఏడాది ద్వితీయార్థంలో విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. ఇక కిరణ్ వీటితో పాటుగా సమ్మతమే నేనే మీకు బాగా కావలినవాడిని సినిమాలను చేస్తున్నాడు. ఈ మూడు చిత్రాలు ఏకకాలంలో షూటింగ్‌లు జరుపుకుంటున్నాయి.
Revealing the Massy first look of #VinaroBhagyamuVishnuKatha featuring @Kiran_Abbavaram 🔥💥
శ్రీ రామ నవమి శుభాకాంక్షలు ✨#AlluAravind #BunnyVas @kashmira_9 @KishoreAbburu @chaitanmusic #MarthandaKVenkatesh @daniel_viswas @imsarathchandra @ItsChavan @GA2Official #VBVKMovie pic.twitter.com/ZPrAUyxcnd
— Geetha Arts (@GeethaArts) April 10, 2022
Read also:
Pawan Kalyan | చిరంజీవి కోసం పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగనున్నాడా?
Teja | బాలీవుడ్లో బిజీకానున్న టాలీవుడ్ డైరెక్టర్?
Ghani | అప్పుడే ఓటీటీలోకి వరుణ్‌తేజ్ ‘గని’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Puri Jagannadh | పూరీ కలను నెరవేర్చిన మెగాస్టార్.. ఇన్నేళ్ళకు ఛాన్స్ ఇచ్చిన చిరు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

