Director Teja | టాలీవుడ్ సక్సెస్ ఫుల్ దర్శకులలో తేజ ఒకడు. సినిమాటోగ్రాఫర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన తేజ దర్శకుడిగా మారి సినీరంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. రాత్రి సినిమాతో ఛాయగ్రహకుడిగా ప్రయాణం మొదలు పెట్టిన తేజ ఎక్కువగా రామ్‌గోపాల్ వర్మ సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశాడు. 1995 నుంచి బాలీవుడ్లో సినిమాటోగ్రాఫర్‌గా తెగ బిజీ అయిపోయాడు. దాదాపు 5ఏళ్ళు బాలీవుడ్లోనే గడిపిన తేజ 2000లో ‘చిత్రం’ సినిమాతో దర్శకుడిగా డెబ్యూ ఇచ్చి మొదటి సినిమాతోనే సూపర్ హిట్టను సాధించాడు. ఆ తర్వాత వరుసగా సినిమాలను చేస్తూ హ్యట్రిక్ హిట్లను సాధించాడు. ఇండస్ట్రీలో కొత్త వారిని ప్రోత్సహించడంవలో తేజ ఎప్పుడు ముందుంటాడు. ఉదయ్‌కిరణ్, నితిన్, నవదీప్ లాంటి యువ హీరోలను తెలుగు ప్రేక్షకులకు ఈయనే పరిచయం చేశాడు.
గతకొంత కాలంగా ఈయన నుంచి చెప్పోదగ్గ సినిమాలు రాలేవు. గత పదిహేనేళ్లలో ‘నేనే రాజు నేనే మంత్రి’ తప్పితే మరో హిట్టు లేదు. ప్రస్తుతం ఈయన రానా తమ్ముడు అభిరామ్‌ను హీరోగా పరిచయం చేస్తూ ‘అహింస’ అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రాన్ని ఇదే ఏడాది ద్వితీయార్థంలో విడుదల చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే తేజ మరో సారి బాలీవుడ్లో బిజీ కానున్నట్లు తెలుస్తుంది. ఇటీవలే ఈయన బాలీవుడ్లో రెండు ప్రాజెక్ట్‌లకు సైన్ చేశాడు. ‘జకీమా’ అనే టైటిల్‌తో తేజ ఓ హిందీ సినిమా చేయనున్నాడు. ఇందులో ఇద్దరు బాలీవుడ్ స్టార్లు నటిస్తున్నారు. ఈ చిత్రం కాశ్మీర్ బ్యాక్ డ్రాప్లో జరుగుతుందని సమాచారం.
దీనితో పాటుగా ‘తజ్కారీ’ అనే టైటిల్‌తో ఓ వెబ్ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నాడు. 1980 బ్యాక్‌డ్రాప్‌లో ఈ స్టోరీ జరుగనుందట. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ వెబ్‌సిరీస్ నాలుగు సిరీస్‌లుగా ప్రేక్షకుల ముందుకు రానుందట. ఇందులో నటించే నటీనటులు సాంకేతిక విభాగం వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయిని సమాచారం. ఈ రెండు ప్రాజెక్టులను ఎన్‌హెచ్ స్టూడియోస్, టైమ్ ఫిల్మ్స్, ట్రిప్లిక్స్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.