Acharya | చిరంజీవి ప్రస్తుతం సినిమాల వేగాన్ని పెంచాడు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈయన వరుసగా సినిమాలను ఓకే చేస్తూ షూటింగ్‌లను పూర్తి చేస్తున్నాడు. ప్రస్తుతం ఈయన చేతిలో ఐదు సినిమాలున్నాయి. ఈయన లేటెస్ట్గా నటించిన ‘ఆచార్య’ విడుదలకు సిద్ధంగా ఉంది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రామ్‌చరణ్ కీలకపాత్రలో నటించాడు. ఇప్పటికే చిత్రం నుంచి విడుదలైన టీజర్ ప్రేక్షకులలో భారీ అంచనాలను నమోదు చేసింది. కాగా ఈ చిత్ర ట్రైలర్ ఏప్రిల్12న విడుదల కానున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు. ఇదే క్రమంలో ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏప్రిల్24న జరగబోతున్నట్లు తెలిపారు. అయితే ఈ ప్రీ రిలీజ్ వేడుకకు రానున్న గెస్టుల గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో భారీ ఎత్తులో జరుగనున్న ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిలుగా పవన్ కళ్యాణ్, కేటీఆర్‌లు రానున్నట్లు తెలుస్తుంది. దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కాజల్‌అగర్వాల్, పూజా హెగ్డే కథానాయికలుగా నటిస్తున్నారు. మ్యాట్నీ ఎంటర్టైనమెంట్స్ బ్యానర్‌తో కలిసి రామ్‌చరణ్ స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తున్నాడు. మణిశర్మ సంగీతం అందించాడు. ఇదివరకే విడుదలైన ‘లాహె..లాహె’, ‘సానా కష్టం’ పాటలు శ్రోతలను విపరీతంగా ఆకట్టుకున్నాయి.ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉన్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.