Kiran Abbavaram – Rahasya Gorak | టాలీవుడ్ యువ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram), నటి రహస్య గోరక్ (Rahasya Gorak)ల పెళ్లి డేట్ ఫిక్స్ అయ్యింది. వచ్చే నెలలో వీరి పెళ్లి జరుగనున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని రహస్య గోరక్ ఇన్‌స్టా ఖాతాలో వెల్లడించింది.
నేడు కిరణ్ అబ్బవరం పుట్టినరోజు. ఈ సందర్భంగా రహస్య గోరక్ అతడికి విషెస్ తెలుపుతూ.. హ్యాపీ బర్త్ డే కిరణ్. మరో 38 రోజుల్లో.. నిన్ను మొగుడా పిలిచేందుకు ఆశగా ఎదురుచూస్తున్నా అంటూ రాసుకోచ్చింది. ఈ సందర్భంగా వీళ్లిద్దరు పరిచయం అయినప్పటి నుంచి ఎంగేజ్మెంట్ వరకు దిగిన ఫొటోలను వీడియో రూపంలో క్రియేట్ చేసి అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.
ఈ ఏడాది మార్చి నెలలో వీరి ఎంగేజ్మెంట్ గ్రాండ్‌గా జరిగిన విషయం తెలిసిందే. ‘రాజావారు రాణిగారు’ (Raja Vaaru Rani Gaaru) సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు. ఇక తొలి సినిమాతోనే కిరణ్, రహస్య గోరక్ ప్రేమలో పడ్డారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే మొదట్లో స్నేహితులుగా ఉన్నా.. ఆ తర్వాత వీరి స్నేహం ప్రేమగా మారింది.
Also read..
KA Movie | తోడేలు వచ్చేసింది.. యాక్షన్ ప్యాక్డ్గా కిరణ్ అబ్బవరం ‘క’ టీజర్
Panjagutta PVR | ‘కల్కి’ సినిమా చూస్తుండగా పంజాగుట్ట పీవీఆర్‌లో వర్షం.. వీడియో వైరల్
Siva Karthikeyan | కొడుకుకి నామకరణం చేసిన శివకార్తికేయన్.. పేరు ఏంటో తెలుసా.?