Meena Kumari Biopic | బాలీవుడ్లో మళ్లీ బయోపిక్‌ల ట్రెండ్ జోరుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరో బయెపిక్ తెరమీదకి రాబోతుంది. దివంగత నటి, ‘ట్రాజెడీ క్వీన్’ గా ప్రసిద్ధి చెందిన మీనా కుమారి జీవితం ఆధారంగా ఒక బయోపిక్ రాబోతున్నట్లు తెలుస్తుండగా.. ఈ చిత్రంలో కియారా అద్వాణీ మీనా కుమారి పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం.
అలనాటి ‘ట్రాజెడీ క్వీన్’ మీనా కుమారి గురించి సినీ ప్రియులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ‘బైజుబాన్రా’, ‘పాకీజా’ వంటి క్లాసిక్ చిత్రాలతో భారతీయ సినిమా చరిత్రలో తనకంటూ ఒక సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు మీనా కుమారి. ఆమె జీవితంలో దాగి ఉన్న భావోద్వేగాలు, బాధలు, కీర్తి, ప్రేమ.. ఇలా అన్నీ వెండితెరపై మరోసారి ప్రతిభావంతంగా ఆవిష్కరించేందుకు బాలీవుడ్ సిద్ధమవుతోంది. ఈ భారీ బయోపిక్కు ప్రఖ్యాత ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా స్వయంగా నిర్మించి, దర్శకత్వం వహించబోతున్నట్లు సమాచారం. ఫ్యాషన్ ప్రపంచంలో తనదైన ముద్ర వేసిన మనీష్, ఇప్పుడు సినిమా దర్శకత్వంలో అరంగేట్రం చేయనుండగా, ఆయన తొలి చిత్రమే ‘మీనా కుమారి’ బయోపిక్ కావడం విశేషం.
తాజా సమాచారం ప్రకారం, ఈ ప్రతిష్టాత్మక బయోపిక్‌లో కియారా అద్వాణీనే కథానాయికగా ఎంపికైనట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. మీనా కుమారి పాత్రలో నటించేందుకు పలువురు హీరోయిన్లు ఆసక్తి చూపినప్పటికీ, ఆ పాత్రకు అవసరమైన భావోద్వేగం, విలువ, గంభీరత కియారా నుంచే రావచ్చని చిత్ర బృందం బలంగా నమ్ముతోందట. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు తుది దశలో ఉన్నాయని, దీనిపై అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుందని కియారా సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.
Read More