ముందు చిన్న సినిమాలతో మొదలై.. కాలం కలిసి రావడంతో పెద్ద సినిమాలలో నటించేసి, స్టార్హీరోలతో జతకట్టి.. ఎట్టకేలకు తామూ స్టార్ హీరోయిన్లమే అనిపించుకోవడానికి హీరోయిన్లు పడే కష్టం అంతాఇంతా కాదు. కానీ.. మన ఇన్‌స్టా స్టార్ ఇమాన్వీ ఇస్మాయిల్ మాత్రం ఇవేమీ చేయకుండానే.. తొలి సినిమాకే ఏకంగా పానిండియా సూపర్‌స్టార్ ప్రభాస్‌కే హీరోయిన్ అయి కూర్చుంది.
‘ఫౌజీ’ సినిమాలో కథానాయికగా దర్శకుడు హను రాఘవపూడి ఈ మద్దుగుమ్మను ఎంపిక చేయగానే.. ‘తంతే బూరెల గంపలో పడటం అంటే ఇదే’ అంటూ పలువురు అభిప్రాయాలు వెలిబుచ్చారు. నిజానికి కూడా ఆమె అదృష్టం మామూలుగా లేదు. ఎందుకంటే ‘ఫౌజీ’ నిర్మాణంలో ఉండగానే మరో భారీ అవకాశం ఈ అందాలభామను వరించినట్టు తెలిసింది. వివరాల్లోకెళ్తే.. పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే.
ఈ సినిమాలో కథానాయికగా ఇమాన్వీ అయితే బావుంటుందనే అభిప్రాయాన్ని పవన్‌తో సురేందర్‌రెడ్డి వ్యక్తం చేశారట. పవన్ కూడా ఈ విషయంపై సానుకూలంగా స్పందించారట. ఈ విషయంలో తాను పట్టించుకోనని, పాత్రకు ఎవరు సూట్ అయితే.. వారినే ఎంపిక చేయమని పవన్ ఖరాకండీగా చెప్పారట. దాంతో ఇమాన్వీ ఎంపిక దాదాపు ఖరారైందని తెలిసింది. అదృష్టం ఉంటే అవకాశాలు వాటంతటవే వస్తాయనడానికి ఇంతకంటే ఉదాహణ ఏంకావాలి?