Game Changer Teaser | తెలుగు ప్రేక్షకులకు పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేని భామ కియారా అద్వానీ (Kiara Advani). ఈ భామ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోన్న చిత్రాల్లో ఒకటి గ్లోబల్ స్టార్ రాంచరణ్ (Ram Charan) టైటిల్ రోల్లో పోషిస్తున్న గేమ్‌ఛేంజర్ (Game Changer). శంకర్ (Shankar) దర్శకత్వం వహిస్తున్నాడు. నవంబర్ 9న లక్నోలో గేమ్ ఛేంజర్ టీజర్ గ్రాండ్‌గా లాంచ్ చేయబోతున్న విషయం తెలిసిందే.
నవంబర్ 9న మూడు రాష్ట్రాలు 11 థియేటర్లలో సాయంత్రం 4:30 గంటల నుంచి సెలబ్రేషన్స్ ఉండబోతున్నాయని తెలియజేశారు. మరోసారి టీజర్ డేట్ గుర్తు చేస్తూ కియారా అద్వానీ లుక్ విడుదల చేశారు మేకర్స్. నీలం రంగు కాస్ట్యూమ్స్‌లో హొయలుపోతూ అందాలు ఆరబోస్తున్న లుక్ నెట్టింట హల్ చల్ చేస్తూ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తుంది.
ఈ చిత్రంలో రాజోలు సుందరి అంజలి మరో ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా.. నవీన్ చంద్ర, సునీల్, శ్రీకాంత్, బాలీవుడ్ యాక్టర్ హ్యారీ జోష్, కోలీవుడ్ యాక్టర్లు ఎస్జే సూర్య, సముద్రఖని, కన్నడ నటుడు జయరామ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు తెరకెక్కిస్తుండగా.. కార్తీక్ సుబ్బరాజు కథనందిస్తుండగా.. సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ సమకూరుస్తున్నారు. ఈ మూవీకి ఎస్ థమన్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
One day away from witnessing the magic of Global Star @AlwaysRamCharan and the beautiful @advani_kiara 🤩🤩❤️#GameChanger 🔥#GameChangerTeaser on 9th NOVEMBER 💣
In cinemas worldwide from 10th Jan.@shankarshanmugh @yoursanjali @iam_SJSuryah @MusicThaman @actorsrikanth… pic.twitter.com/LfwyoaljpG
— BA Raju’s Team (@baraju_SuperHit) November 8, 2024
Akira Nandan | ప్రిపరేషన్ షురూ.. గ్రాండ్ ఎంట్రీ కోసం అకీరానందన్ ట్రైనింగ్.. !
krish jagarlamudi | డైరెక్టర్ క్రిష్ ఇంట వెడ్డింగ్ బెల్స్.. ఇంతకీ అమ్మాయి ఎవరో తెలుసా..?
Devara | ఓటీటీలో దేవర సందడి.. ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందంటే.. ?