పాపం ఆ ఏనుగుకు ఆకలేసినట్లుంది.. ఆ ప్రాంతంలో ఎలాంటి ఆహార పదార్థాలు కనిపించలేదు. దీంతో అక్కడున్న ఓ హెల్మెట్‌ను తొండంతో తీసుకుని, నోట్లోకి లాగేసుకుంది. ఈ ఘటన అసోం గువహాటిలోని సత్గావ్ ఆర్మీ క్యాంపు వద్ద వెలుగు చూసింది. నోట్లో హెల్మెట్ పెట్టుకున్న ఏనుగు అక్కడ్నుంచి మెల్లగా వెళ్లిపోయింది. ఈ దృశ్యాలను హెల్మెట్ యజమాని తన సెల్ఫోన్లో చిత్రీకరించి వైరల్ చేశాడు. తన హెల్మెట్‌ను ఏనుగు లాగేసుకుంది.. తాను ఎలా వెళ్లాలి అని అతను వాపోయాడు. అయితే ఆహారం కోసం అమ్చాంగ్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం నుంచి ఆర్మీ క్యాంపు సమీపంలోకి ఏనుగులు వస్తుంటాయని అధికారులు పేర్కొన్నారు.