KGF | అప్పటి వరకు తెలుగు ఇండస్ట్రీలో కన్నడ సినిమాలకు పెద్దగా గుర్తింపు లేదు. అక్కడి నుంచి సినిమాలు డబ్బింగ్ చేశారు అంటే పోస్టర్ ఖర్చులు కూడా రావు అని అనుకునేవారు. అలాంటి సమయంలో తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన సినిమా కేజీఎఫ్. 2018 డిసెంబర్ 21న ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కేజీఎఫ్ ఇండియన్ సినిమా హిస్టరీలో బెస్ట్ హీరో ఎలివేషన్స్ ఉన్న సినిమాగా నిలిచిపోయింది. ఈ ఒక్క సినిమాతో యష్ దేశ వ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా దర్శకుడు అయిపోయాడు. మరీ ముఖ్యంగా తెలుగులో ఈయనకు హీరోలంతా ఫిదా అయిపోయారు. ఈ సినిమాతో వచ్చిన క్రేజ్ వల్ల ఐదు తెలుగు సినిమాలతో బిజీ అయిపోయాడు. ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి హీరోలు సినిమాలు చేయబోతున్నారు. ఈయనకు అంతటి గుర్తింపు తీసుకొచ్చిన కేజీఎఫ్ సినిమా విడుదలై నేటికి మూడేళ్లయింది. లెజండరీ నటుడు కైకాల సత్యనారాయణ ఈ సినిమా తెలుగులో సమర్పించడం గమనార్హం. బంగారు గనుల నేపథ్యంలో వచ్చిన కేజీఎఫ్ నిర్మాతలతో పాటు డిస్ట్రిబ్యూటర్లకు కూడా నిజంగానే బంగారు బాతులా మారిపోయింది. 2022 ఏప్రిల్ 14న కేజీఎఫ్ 2 విడుదల కానుంది. ఈ సినిమా మొత్తం బిజినెస్ రూ.250 కోట్లు దాటింది. మరి మొదటి భాగం ఎంత వసూలు చేసింది.. ఎంత బిజినెస్ చేసింది అనేది ఇప్పుడు చూద్దాం..
నైజాం: 4.75 కోట్లు
సీడెడ్: 2.30 కోట్లు
ఉత్తరాంధ్ర: 1.46 కోట్లు
ఈస్ట్: 1.72 కోట్లు
వెస్ట్: 0.60 కోట్లు
గుంటూరు: 0.91 కోట్లు
కృష్ణా: 1.15 కోట్లు
నెల్లూరు: 0.31 కోట్లు
ఏపీ-తెలంగాణ టోటల్: 12.20 కోట్లు
తెలుగులో ఈ సినిమాకు రూ.4.6 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఒక కన్నడ సినిమాకు ఈ స్థాయిలో బిజినెస్ చేయడం నిజంగా ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. అయితే విడుదల తర్వాత అందరి అంచనాలు తలక్రిందులు చేస్తూ డిస్ట్రిబ్యూటర్లకు మూడింతలు లాభాలు తీసుకొచ్చింది కేజీఎఫ్. ఇప్పుడు రెండో భాగం బిజినెస్ తెలుగులో దాదాపు 60 కోట్ల వరకు జరుగుతుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఆ హీరోయిన్ కోసం రవితేజను బాలయ్య కొట్టాడా? గొడవలపై క్లారిటీ వచ్చేసింది
Bheemla nayak postponed | భీమ్లా నాయక్ ఎఫెక్ట్.. ఎఫ్ 3 రిలీజ్ వాయిదా
Rakul | పెళ్లి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన రకుల్!
Samantha | సెక్సీగా కనిపించడం అంత ఈజీ కాదు.. సమంత షాకింగ్ పోస్ట్