KGF 2 Hindi mark | కన్నడ స్టార్ యాక్టర్ యశ్ (Yash) లీడ్ రోల్లో నటించిన చిత్రం కేజీఎఫ్ చాఫ్టర్ 2 (KGF chapter 2). ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో పీరియాడిక్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం అంచనాలకు మించి రికార్డులను సృష్టిస్తూ..టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారుతోంది. తెలుగు, కన్నడ, హిందీతోపాటు విడుదలైన అన్ని భాషల్లో కాసుల వర్షం కురిపిస్తోంది. ప్రత్యేకించి హిందీలో చేరుకున్న ల్యాండ్ మార్క్ ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తోంది.
కేజీఎఫ్ 2 హిందీలో రూ.350 కోట్ల మార్కును చేరుకుంది. కేవలం 14 రోజుల్లోనే సూపర్ యాక్టివ్‌గా రూ.350 కోట్లు సాధించిన సినిమాగా రికార్డుల్లోకెక్కింది. హాలీడే సీజన్ కావడం..మరోవైపు షాహిద్ కపూర్ నటించిన జెర్సీ ప్లాప్ కావడంతో, థియేటర్లలో కేజీఎఫ్ 2ను బాక్సాపీస్ వద్ద తన హవాను కొనసాగిస్తోంది. రానున్న రోజుల్లో ఈ ప్రాజెక్టు 400 కోట్ల మార్కును చేరుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మరి ఇంకెన్ని రోజుల్లో ఈ మార్కు చేరుకుంటుందని ఎక్జయిటింగ్‌గా చూస్తున్నారు సినీ జనాలు. కేజీఎఫ్ చాఫ్టర్లో శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించింది. బాలీవుడ్ నటి రవీనాటాండన్, టాలీవుడ్ యాక్టర్లు ప్రకాశ్ రాజ్, రావు రమేశ్ కీలక పాత్రలు పోషించారు.
Read Also : Anil Ravipudi | మహేశ్ కోసం కథ రెడీ చేస్తున్నా: అనిల్ రావిపూడి
Read Also : Acharya review | చిరంజీవి ‘ఆచార్య’ మూవీ రివ్యూ
Read Also : Hombale Films | కొత్త సినిమాతో కేజీఎఫ్ మేకర్స్ సర్ప్రైజ్..ఎంట్రీ లుక్ వైరల్
Read Also : Major Release date | మేజర్ కొత్త విడుదల తేదీ ఫైనల్..షేర్ చేసిన మహేశ్ బాబు