Sunny Leone | బాలీవుడ్ స్టార్ నటి సన్నీ లియోన్ (Sunny Leone)కు షాక్ తగిలింది. ఆమె తలపెట్టిన ఓ డ్యాన్స్ ఈవెంట్‌కు కేరళ యూనివర్సిటీ నిరాకరించింది (Kerala University Denies Permission). తిరువనంతపురంలోని కార్యవట్టం యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ కళాశాలలో (University College of Engineering, Karyavattom) జులై 5న సన్నీలియోన్ డ్యాన్స్ ప్రదర్శన (Dance Event) నిర్వహించాలని భావించారు. అయితే, ఈ ప్రదర్శనకు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ మోహనన్ కున్నుమ్మల్ (Dr. Mohanan Kunnummal) అనుమతి నిరాకరించారు. ప్రోగ్రామ్ జాబితా నుంచి సన్నీ లియోన్ ప్రదర్శనను తీసేయాలని వర్సిటీ రిజిస్ట్రార్‌ను ఆదేశించారు. క్యాంపస్ లోపల, బయట ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిచేందుకు యూనియన్ను అనుమతించబోమని స్పష్టం చేశారు.
అయితే, గతేడాది కొచ్చిన్ యూనివర్సిటీలో చోటు చేసుకున్న విషాద ఘటనల నేపథ్యంలో వర్సిటీల్లో డీజే పార్టీలు, మ్యూజిక్ నైట్స్ వంటి కార్యక్రమాలపై ప్రభుత్వం బ్యాన్ విధించింది. గతేడాది కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్సెస్ అండ్ టెక్నాలజీలో నిర్వహించిన మ్యూజిక్ కన్సర్ట్‌లో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో నలుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోగా.. సుమారు 64 మంది స్టూడెంట్స్‌కి గాయాలయ్యాయి. ఈ ఘటనను కేరళ హైకోర్ట్ తీవ్రంగా పరిగణించింది. నిర్వహణ వైఫల్యం కారణంగానే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు గుర్తించింది. ఈ మేరకు ఇలాంటి ఘటనలు వర్సిటీల్లో పునరావృతం కాకూడదని ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో వర్సిటీల్లో ఇలాంటి ఈవెంట్స్‌పై ప్రభుత్వం బ్యాన్ విధించింది. ఈ ఘటనల నేపథ్యంలోనే తాజాగా సన్నీ లియోన్ ఈవెంట్‌కు వీసీ అనుమతిని నిరాకరించినట్లు స్టేట్ మీడియా తెలిపింది.
Also Read..
Ice Cream | కోన్ ఐస్‌క్రీమ్‌లో మనిషి వేలు.. ముంబై వైద్యుడికి ఊహించని అనుభవం
Sunetra Pawa | లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి.. రాజ్యసభకు నామినేషన్ వేసిన సునేత్ర పవార్
GST Council Meeting | ఈ నెల 22న 53వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం