Actor Dileep | కేరళలో సంచలనం సృష్టించిన లైంగిక వేధింపుల కేసు (sexual assault case)లో కేరళ కోర్టు (Kerala court) సంచలన తీర్పు వెలువరించింది. ఓ నటి అపహరణ, అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ మలయాళ నటుడు దిలీప్ (Actor Dileep)ను నిర్దోషిగా తేల్చింది. ఈ మేరకు ఎర్నాకులం కోర్టు సోమవారం తీర్పు వెలువరించింది.
2017లో మలయాళ నటి కిడ్నాప్ కేసు సంచలనం రేపింది. కారులో ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు నటుడు దిలీప్‌పై ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో పోలీసులు నటుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ మేరకు దిలీప్‌ను అరెస్ట్ కూడా చేశారు. అయితే బెయిల్‌పై అతడు రిలీజ్ అయ్యారు. ఇక ఎనిమిదేళ్లపాటూ సాగిన ఈ కేసులో కోర్టు నేడు సంచలన తీర్పు వెలువరించింది. ఆరోపణలపై తగిన ఆధారాలు చూపించలేకపోయిన కారణం చేత ఎర్నాకులం సెషన్స్ కోర్టు దిలీప్‌ను నిర్దోషిగా తేల్చింది. ఈ మేరకు సోమవారం ఉదయం తీర్పు వెలువరించింది. దిలీప్ సహా ముగ్గురిని నిర్దోషులుగా విడుదల చేసింది. ఇక అత్యాచారం, కుట్ర కేసులో మరో ఆరుగురిని దోషులుగా తేల్చింది.
Also Read..
OTT Movies | అఖండ2 సైడ్ ఇవ్వడంతో దూసుకొచ్చిన చిన్న సినిమాలు.. ఓటీటీలోను సందడే సందడి
Salman Khan | బిగ్ బాస్ వేదికపై కన్నీళ్లు పెట్టుకున్న సల్లూభాయ్.. కారణం ఏంటంటే..!
Krithi Shetty | నా రూమ్‌లో ఆత్మ కనిపించింది.. యంగ్ హీరోయిన్ కృతి శెట్టి భయానక అనుభవం