Raghu Thatha | నేషనల్ అవార్డు విన్నింగ్ బ్యూటీ కీర్తి సురేశ్ (Keerthy Suresh) నటిస్తోన్న తాజా చిత్రాల్లో ఒకటి రఘు తాతా (Raghu Thatha). సుమన్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే గ్లింప్స్ విడుదల చేయగా నెటిజన్లను ఆకట్టుకుంటోంది. చాలా రోజుల తర్వాత కీర్తిసురేశ్ టీం మూవీ సెన్సార్ అప్డేట్ షేర్ చేసింది. రఘుతాతా చిత్రానికి యూ సర్టిఫికెట్ జారీ చేసిందని తెలియజేశారు మేకర్స్. ట్రైలర్ లాంచ్‌పై కూడా క్లారిటీ ఇవ్వనున్నట్టు తెలియజేశారు.
కీర్తి సురేశ్ నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (NCC)లో క్యాడెట్ శిక్షణ పొందుతున్న సీన్లతో షురూ అయిన టీజర్లో NCC మాస్టర్ హిందీలో శిక్షణ ఇస్తుండగా.. నాకు హిందీ రాదు తమిళంలో చెప్పండి సార్ అంటోంది కీర్తిసురేశ్. హిందీ పరీక్ష రాస్తేనే ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది అంటే దాన్ని కీర్తి సురేశ్ తిరస్కరిస్తుంది. రఘుతాతా తమిళ ప్రజలపై హిందీని రుద్దడం చుట్టూ తిరుగనున్నట్టు టీజర్‌తో క్లారిటీ ఇచ్చేశాడు డైరెక్టర్.
ఈ చిత్రాన్ని పాపులర్ బ్యానర్ హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తుండగా.. ఎంఎస్ భాస్కర్, రవీంద్ర విజయ్, దేవదర్శిని, రాజీవ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి షాన్ రోల్డన్ సంగీతం అందిస్తున్నాడు.
#RaghuThatha censored with 𝐔!
A perfect film to watch with your குடும்பம் in theatres! 🎬#RaghuThathaTrailer Announcement Today.@KeerthyOfficial @hombalefilms @vkiragandur @sumank @vjsub @yaminiyag @RSeanRoldan @rhea_kongara @editorsuresh @tejlabani @mdeii @siva_amstudios… pic.twitter.com/yrLqsM6XmT
— Hombale Films (@hombalefilms) July 30, 2024
Jailer 2 | రజినీకాంత్ జైలర్ 2లో నా క్యారెక్టర్ చాలా స్పెషల్.. యోగి బాబు కామెంట్స్ వైరల్
Mani Ratnam | అఫీషియల్.. కమల్‌హాసన్-మణిరత్నం థగ్ లైఫ్ టీంలోకి మరో ఇద్దరు యాక్టర్లు
Shah Rukh Khan | చికిత్స కోసం యూఎస్‌కు షారుఖ్‌ఖాన్..!
Thug life | డబ్బింగ్ స్టూడియోలో కమల్‌హాసన్.. థగ్ లైఫ్ టీం కొత్త వార్త ఇదే..!