Yellamma | బలగం ఫేం వేణు యెల్దండి కాంపౌండ్ నుంచి రాబోతున్న మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్ట్ ఎల్లమ్మ. ఈ చిత్రంతో మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడంటూ వార్తలు వచ్చినా అధికారికంగా మాత్రం ఎలాంటి అప్డేట్ రాలేదు. కాగా ఎల్లమ్మ చిత్రంలో కీర్తిసురేశ్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తున్నట్టు చాలా రోజుల నుంచి వార్తలు హల్ చల్ చేస్తూనే ఉన్నాయి.
తాజాగా నెట్టింట చక్కర్లు కొడుతున్న వార్త ఒకటి మూవీ లవర్స్‌ను మరింత డైలామాలో పడేస్తుంది. ఎల్లమ్మ సినిమాలో నటిస్తున్నానన్న వార్తలపై క్లారిటీ ఇచ్చేసింది కీర్తిసురేశ్. రివాల్వర్ రీటా ప్రమోషన్స్‌లో కీర్తిసురేశ్ మాట్లాడుతూ.. తెలంగాణ రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో రాబోతున్న ఎల్లమ్మ చిత్రంలో తాను నటిస్తున్నానన్న వార్తలను కొట్టిపారేసింది. మరి ఇంతకీ ఎల్లమ్మ ప్రాజెక్ట్‌లో హీరోయిన్గా ఎవరు కనిపిస్తారు..? హీరోగా డీఎస్పీనే ఉంటాడా..? లేదంటే డైరెక్టర్ వేణు వేరే యాక్టర్‌ను తీసుకుంటాడా..? అనే ప్రశ్నలపై ఏమైనా స్పష్టత ఇస్తారా..? అనేది చూడాలి.
మొదట ఎల్లమ్మలో లీడ్ రోల్ కోసం నానిని సంప్రదించారని వార్తలు రాగా… ఆ తర్వాత నితిన్ పేరు తెరపైకి వచ్చింది. శర్వానంద్, బెల్లం కొండ శ్రీనివాస్ పేర్లు కూడా వినిపించాయి. ఫైనల్‌గా ఎల్లమ్మ ప్రాజెక్ట్ దేవీ శ్రీ ప్రసాద్ దగ్గరకు వచ్చి ఆగింది. ఇంతకీ ఈ వార్తలపై వేణు యెల్దండి అధికారికంగా ఏదైనా చెప్తే కానీ స్పష్టత వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.
Sampath Nandi | దర్శకుడు సంపత్ నంది ఇంట్లో విషాదం .. సినీ ప్రముఖులు సంతాపం