Keerthy Suresh | ఆంధ్రప్రదేశ్ విజయవాడ (vijayawada)లో టాలీవుడ్ స్టార్ నటి, మహానటి కీర్తి సురేశ్ (Keerthy Suresh) సందడి చేశారు. నగరంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్‌కు (shop opening) వచ్చారు. ఈ సందర్భంగా కీర్తి సురేశ్‌ను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. నటితో సెల్ఫీలు, ఫొటోలు దిగేందుకు ఎగబడ్డారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
Stunning in Traditional Outfit ✨🧡@KeerthyOfficial #KeerthySuresh pic.twitter.com/sf4XkKc6VI
— Keerthy SureshTweets (@KeerthySureshTM) April 18, 2025
‘నేను శైలజా’ అనే మూవీతో తెలుగు ప్రేక్షకులని పలకరించింది కీర్తి సురేశ్. ఆ తర్వాత ‘మహానటి’తో ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఈ సినిమాతో జాతీయ ఉత్తమనటిగా అవతరించింది. ఆ తర్వాత తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో వరుస పెట్టి సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం కీర్తి ఓ క్రేజీ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కీర్తి ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా వెబ్ సిరీస్ అక్క(AKKA). బాలీవుడ్ నటి రాధికా ఆప్టే ఇందులో కీలక పాత్రలో నటించబోతుంది.
Beautiful captures 😻 from today’s Event pics..😍❤️@KeerthyOfficial ❤️👑#KeerthySuresh #Meenajo pic.twitter.com/nj9QmG6DDl
— M e e n a J o 💙 (@MeenaJo7) April 18, 2025
యష్ రాజ్ ఫిలిమ్స్, నెట్‌ఫ్లిక్స్ సంయుక్తంగా ఈ వెబ్ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నుంచి నెట్‌ఫ్లిక్స్ ఇటీవలే ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్‌ను వదిలింది. ఈ టీజర్ చూస్తుంటే.. కీర్తి ఇందులో లేడి డాన్ అక్కగా కనిపించబోతుంది. పెర్నూరుకు చెందిన ఒక అమ్మాయి అక్కలపై ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తుందని అనే స్టోరీలైన్‌తో ఈ సినిమా రాబోతోంది.
Also Read..
Veera Dheera Sooran | ఓటీటీలోకి విక్రమ్ ‘వీర ధీర శూరన్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే.!
L2 Empuraan OTT | ఓటీటీలోకి ‘ఎల్ 2: ఎంపురాన్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే.!
Karthi at Sabarimala | శబరిమల అయ్యప్పను దర్శించుకున్న నటులు కార్తి, జయం రవి