L2 Empuraan | మలయాళం నుంచి వచ్చి బాక్సాఫీస్ వద్ద రికార్డులు సాధించిన మోహన్ లాల్ ‘ఎల్ 2: ఎంపురాన్’ (L2: Empuraan) మూవీ ఓటీటీలో అలరించేందుకు సిద్ధమైంది. ఈ సినిమాలో మలయాళీ సూపర్ స్టార్, నటుడు మోహన్‌లాల్ (Mohanlal) ప్రధాన పాత్రలో నటించగా.. మలయాళ నటుడు, దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. మంజు వారియర్ (Manju Warrier), టోవినో థామస్(Tovino Thomas) కీలక పాత్రల్లో నటించారు. మార్చి 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఒకవైపు పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతునే మరోవైపు వివాదాల్లో చిక్కుకుంది. రీసెంట్గా ఈ చిత్రం రూ.250 కోట్లకు పైగా వసూళ్లను కూడా రాబట్టింది. అయితే ఈ చిత్రం తాజాగా ఓటీటీ అనౌన్స్‌మెంట్‌ను పంచుకుంది.
ప్రముఖ ఓటీటీ వేదిక జియో హాట్‌స్టార్(Jio Hotstar)లో ఈ నెల 24 నుంచి తెలుగు, మలయాళం, కన్నడ, తమిళ భాషల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కాబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను పంచుకుంది.
L2: Empuraan will be streaming from 24 April only on JioHotstar. #Empuraan #JioHotstar #EmpuraanOnJioHotstar #PrithvirajSukumaran #MalayalamCinema #Mollywood #EmpuraanMovie #Lucifer2 #EmpuraanL2 #L2E pic.twitter.com/ABTh6suEnZ
— Mohanlal (@Mohanlal) April 17, 2025