Chiyaan Vikram | తమిళ నటుడు చియన్ విక్రమ్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘వీర ధీర శూరన్’(Veera Dheera Sooran). పార్ట్-2’గా రూపొందిన ఈ సినిమాకు ఎస్.యు.అరుణ్ కుమార్ దర్శకత్వం వహించగా.. హెచ్.ఆర్.పిక్చర్స్ బ్యానర్‌పై రియా శిబు నిర్మించింది. మార్చి 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తమిళంలో మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా ఓటీటీ అనౌన్స్‌మెంట్‌ను పంచుకుంది. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఏప్రిల్ 24 నుంచి తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు వెల్లడించింది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను పంచుకుంది.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. కాళి (విక్రమ్) ఒక ఊరిలో చిన్న కిరాణా దుకాణం నడుపుతూ, తన భార్య వాణి (దుషారా విజయన్), పిల్లలతో ప్రశాంతమైన జీవితం గడుపుతుంటాడు. అయితే కాళి గతం పూర్తిగా వేరు. ఊళ్లో పలుకుబడి ఉన్న రవి (థర్టీ ఇయర్స్ పృథ్వీ) అనే పెద్దమనిషికి నమ్మకస్థుడిగా ఉంటూ, అనేక గొడవల్లో చిక్కుకున్న చరిత్ర అతనిది. గతాన్ని మరచి, కొత్త జీవితంలో స్థిరపడిన కాళి జీవితంలోకి మళ్లీ రవి ప్రవేశిస్తాడు. తననూ, తన కొడుకు కన్నన్నూ (సూరజ్ వెంజరమూడు) ఎన్కౌంటర్ చేయాలనుకునే ఎస్పీ అరుణగిరి (ఎస్.జె.సూర్య)ని చంపాలని కాళిని సాయం కోరుతాడు రవి. అయితే సాధారాణ జీవితం గడుపుతున్న కాళి మళ్లీ ఈ పనికి ఒప్పుకోవడానికి గల కారణాలు ఏంటి ? రవి మరియు ఎస్పీ అరుణగిరి మధ్య శత్రుత్వానికి మూలం ఏమై ఉంటుంది? ఈ వివాదంలో కాళికి ఏదైనా పాత సంబంధం ఉందా? తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి, బెదిరింపులను ఎదుర్కొన్న కాళి తీసుకున్న చర్యలు ఏమిటి? అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
One night. No rules. Only survival. A night that will change everything. 🔥#VeeraDheeraSooranOnPrime, April 24 pic.twitter.com/os8pfrjyUJ
— prime video IN (@PrimeVideoIN) April 18, 2025