Keerthy Suresh | నేషనల్ అవార్డ్ విన్నింగ్ బ్యూటీ కీర్తిసురేశ్ (Keerthy Suresh) వ్యాపారవేత్త ఆంథోని తట్టిల్ (Anthony Thattil)ను వివాహం చేసుకోబోతున్న విషయం తెలిసిందే. వెడ్డింగ్ డేట్‌పై త్వరలో క్లారిటీ ఇవ్వనున్నారు కుటుంబసభ్యులు. కాగా వెడ్డింగ్ ఎలా ఉండబోతుందనే దానిపై ఆసక్తికర వార్త తెరపైకి వచ్చింది. తాజా సమాచారం ప్రకారం థీమ్ బేస్డ్ వెడ్డింగ్‌ను ప్లాన్ చేస్తున్నారట. రెండు రోజులపాటు జరుగనున్న ఈ వేడుకల్లో మూడు ఈవెంట్స్ ఉండబోతుండగా.. వీటిలో ఒక్కోటి ఒక్కో థీమ్‌తో ఉండనున్నాయని ఇన్సైడ్ టాక్.
అంతేకాదు హిందూ, క్రిస్ట్రియన్ సంప్రదాయాల ప్రకారం కీర్తిసురేశ్ వెడ్డింగ్ జరుగనుండగా.. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చకచకా జరుగుతున్నాయట. కీర్తిసురేశ్ ప్రస్తుతం వరుణ్ ధవన్‌తో కలిసి బేబిజాన్ సినిమాలో నటిస్తోంది. కీర్తిసురేశ్‌కు ఇది హిందీలో తొలి సినిమా. ఈ చిత్రం డిసెంబర్ 25న గ్రాండ్‌గా విడుదల కానుంది. మరోవైపు రివాల్వర్ రీటా సినిమాలో కూడా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ నెట్టింట వైరల్ అవుతూ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది.
Read Also :
Dua Lipa | హ్యాపీ మూమెంట్స్.. దువా లిపాతో టాలీవుడ్ స్టార్ సెలబ్రిటీల కూతుళ్లు
Raja Saab | రాజాసాబ్ టీజర్, మాస్ సాంగ్ వచ్చేస్తున్నాయి.. ప్రభాస్ ఫ్యాన్స్ రెడీనా..?
Ram Gopal Varma | అప్పటిదాకా నో అరెస్ట్.. రాంగోపాల్ వర్మకు ఏపీ హైకోర్టులో ఊరట