చందూ మొండేటి (Chandoo Mondeti) డైరెక్షన్లో నిఖిల్(Nikhil Siddharth) హీరోగా నటించిన చిత్రం కార్తికేయ. బాక్సాపీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకుంది. ఇపుడీ చిత్రానికి సీక్వెల్ కార్తికేయ 2 వస్తోన్న విషయం తెలిసిందే. అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తుండగా..శ్రీనివాస్ రెడ్డి కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ మూవీ ట్రైలర్ (Karthikeya 2 Trailer)ను మేకర్స్ విడుదల చేశారు.
శాంతను ఇది నువ్వు ఆపలేని యాగం. నేను సమిధను మాత్రమే. ఆజ్యం అక్కడ మళ్లీ మొదలైంది..అనే సంభాషణలతో మొదలైంది ట్రైలర్. అసలు కృష్ణుడేంటి..ఈ కథను ఆయనే నడిపించడమేంటి..అని అడుగుతున్నాడు నిఖిల్. విశ్వం ఒక పూసల దండ..ప్రతీది నీకు సంబంధమే అని ఓ పూజారి అంటున్నాడు..సస్పెన్స్ ఎలిమెంట్స్ తో క్యూరియాసిటీని కలగజేస్తూ సినిమాపై అంచనాలు పెంచుతోంది ట్రైలర్.
థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న ఈచిత్రంలో బాలీవుడ్ దర్శకనిర్మాత అనుపమ్‌ఖేర్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. కార్తీక్ ఘట్టమనేని కెమెరా వర్క్ చేస్తుండగా..కాలభైరవ సంగీతం అందిస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: చందు మొండేటి.