Retro | కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) వరుస సినిమాలను లైన్లో పెట్టాడని తెలిసిందే. ఈ స్టార్ యాక్టర్ నటిస్తున్న చిత్రాల్లో ఒకటి కార్తీక్ సుబ్బరాజు (Karthik Subbaraju) దర్శకత్వం వహిస్తున్న రెట్రో ( Retro: Love Laughter War). సూర్య 44 (Suriya 44)గా వస్తోన్న ఈ మూవీని మే 1న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారని తెలిసిందే.
తాజాగా కార్తీక్ సుబ్బరాజు టీం ఆసక్తికర ట్వీట్ చేసింది. అండమాన్ షెడ్యూల్ చివరి రోజు. సీక్రెట్ ప్లాన్‌తో నిండిపోయింది. బృందంలోని ఒక భాగం షూటింగ్ పూర్తి చేయడంపై దృష్టి పెట్టగా.. కార్తీక్ సుబ్బరాజ్, డిఓపి శ్రేయాస్ ప్రత్యేకమైన విషయంపై ఆలోచించారు. సూర్య సర్ పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ వీడియో కోసం ఒక సర్ప్రైజ్ షాట్ రెడీ చేశారు. కానీ దాన్ని సీక్రెట్‌గా ఉంచారు.. సీక్రెట్‌గా ఉంచడం మాత్రం చాలెంజ్ లాంటిది.
లొకేషన్లో దర్శకత్వ బృందం పరుగులు పెడుతుంటే.. వారిలో ఒక వ్యక్తి దీన్ని మనం ఎలా సార్ (సూర్య) నుండి దాచాలి? అని గుసగుసలాడితే .. మరో వ్యక్తి మాత్రం సూర్య సర్ చాలా చురుకుగా ఉంటారు. అతను ఆ సీక్రెట్‌ను కనిపెడతాడు. ఎవరో ఒకరు తన అసిస్టెంట్ దృష్టి మరల్చడానికి మరో మైలు కూడా వెళ్లారు.. అంటూ ఓ మెసేజ్‌ను షేర్ చేసింది టీం. ఇంతకీ కార్తీక్ సుబ్బరాజ్ టీం బర్త్ డే సర్ప్రైజ్ వీడియో కోసం ఏం ప్లాన్ చేసిందనేది ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది.
ఈ మూవీలో పూజాహెగ్డే హీరోయిన్గా నటిస్తుండగా.. పాపులర్ మలయాళ నటుడు జోజు జార్జ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. సూర్య హోం బ్యానర్ 2డీ ఎంటర్టైన్మెంట్పై నిర్మిస్తున్న ఈ మూవీకి తిరు, 24, పేటా ఫేం సినిమాటోగ్రఫర్ డీవోపీగా వర్క్ చేస్తున్నాడు.
➡️ #RetroBTSComic x #RetroFromMay1 🔥
EPI 003 – A SWEET SURPRISE FOR SURIYA SIR! ❤️
The last day of the Andaman schedule was packed with work and a secret plan. While one part of the team focused on wrapping up the shoot, Karthik Subbaraj and DOP Shreyas had something special… pic.twitter.com/UQeTO8cBhp
— Stone Bench (@stonebenchers) February 24, 2025
RETRO టైటిల్ టీజర్..
Dragon | డ్రాగన్ అందమైన సినిమా.. డైరెక్టర్ శంకర్ ట్వీట్‌కు ప్రదీప్ రంగనాథన్ రియాక్షన్ ఇదే
Toxic The Movie | ఒకేసారి రెండు భాషల్లో.. తొలి భారతీయ సినిమాగా యశ్ టాక్సిక్ అరుదైన ఫీట్..!