Karthi | కోలీవుడ్ స్టార్ యాక్టర్లు కార్తీ (Karthi), అరవింద్ స్వామి లీడ్ రోల్స్‌లో నటించిన తమిళ చిత్రం మెయ్యళగన్ (Meiyazhagan). 96 ఫేం ప్రేమ్ కుమార్ సీ దర్శకత్వం వహించిన ఈ మూవీ తెలుగులో ‘సత్యం సుందరం’ (Sathyam Sundaram) పేరుతో విడుదల కానుంది. సెప్టెంబర్ 28న తెలుగు రాష్ట్రాల్లో విడుదలవుతోంది. సోమవారం ప్రమోషన్స్‌లో భాగంగా ఏర్పాటు చేసిన తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ (Prasanth Varma) ముఖ్యఅతిథిగా హాజరయ్యాడు.
ఈ సందర్భంగా ప్రశాంత్ వర్మ ఆసక్తికర విషయమొకటి చెప్పి అందరిలో జోష్ నింపాడు. ఇటీవలే నేను ఓ స్క్రిప్ట్ గురించి చర్చించేందుకు కార్తీ (Karthi)ని చెన్నైలో కలిశానని చెప్పాడు. ఆ తర్వాత తాను కథకు ఇంప్రెస్ అయ్యానని.. అది మాస్ రోల్ అని కార్తీ అన్నాడు. ఈ కామెంట్స్‌తో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU)లో కార్తీ జాయిన్ అయ్యే అవకాశాలున్నాయని ఫిక్సయిపోతున్నారు అభిమానులు, మూవీ లవర్స్.
ప్రశాంత్ వర్మ ప్రస్తుతం నందమూరి మోక్షజ్ఞ డెబ్యూ సినిమాతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. కార్తీ ఈ సినిమాలో భాగం కాబోతున్నాడంటూ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. మరి రాబోయే రోజుల్లో కార్తీ- ప్రశాంత్ వర్మ కాంబోలో సినిమా వస్తుందేమో చూడాలి. ప్రశాంత్ వర్మ మరోవైపు హనుమాన్ సీక్వెల్ ప్రాజెక్ట్ జై హనుమాన్ను కూడా లైన్లో పెట్టాడని తెలిసిందే.
Rathnavelu | దేవరలో జాన్వీకపూర్ కనిపించేది అప్పుడేనట.. రత్నవేలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Jr NTR | దేవర క్రేజ్.. తొలి భారతీయ హీరోగా తారక్ అరుదైన ఫీట్
Game Changer | ఎస్ థమన్ గేమ్ ఛేంజర్ థ్రిల్లింగ్ అనౌన్స్మెంట్ ఏంటో మరి..?