Kannappa | మంచు కుటుంబం నుంచి వస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కన్నప్ప(Kannappa). ఈ సినిమాలో మంచు విష్ణు కథానాయకుడిగా నటిస్తుండగా.. మంచు మోహన్ బాబు నిర్మిస్తున్నాడు. జూన్ 27న వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ చిత్రం. అయితే ఈ సినిమా టికెట్ ధరల పెంపునకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా అనుమతి ఇచ్చింది. సాధారణ టికెట్ రేటుకు అదనంగా సింగిల్ స్క్రీన్స్, మల్టీప్లెక్స్‌ల్లో రూ.50 (జీఎస్టీ అదనం) పెంచుకునేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. సింగిల్ స్క్రీన్లు రూ.206.50 వరకు, మల్టీప్లెక్స్‌లో రూ.236 వరకు పెంచింది. సినిమా విడుదలైన తేదీ (జూన్ 27) నుంచి 10 రోజుల పాటు ఈ ధరలు అమల్లో ఉండబోతున్నాయి.
Read More