Fatima- Vijay Varma | ఈ మధ్య కాలంలో సెలబ్రిటీల ప్రేమ, పెళ్లి వ్యవహారాలు ఓ పట్టాన అర్ధం కావడం లేదు. అప్పుడే ప్రేమ అంటారు అంతలోనే బ్రేకప్ అంటారు. కొద్ది రోజులకి వేరే వ్యక్తితో ఎఫైర్ ఇవన్నీ ఈ మధ్య కామన్ అయ్యాయి. అయితే తమన్నా భాటియా మాజీ లవర్ దంగల్ బ్యూటీతో ప్రేమలో పడ్డాడనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. తమన్నా- విజయ్ వర్మ లవ్ స్టోరీపై ఒకప్పుడు బాలీవుడ్ అంతా చర్చించింది. లస్ట్ స్టోరీస్ 2 సమయంలో వీరిద్దరూ క్లోజ్ అయ్యారని, ఆ తర్వాత నిజంగానే ప్రేమలో ఉన్నారని వారు స్వయంగా వెల్లడించారు. తమన్నా విజయ్ను తెగ పొగిడితే, విజయ్ కూడా ఆమె గురించి ఓపెన్‌గా మాట్లాడాడు. ఒక దశలో ఇద్దరూ కలిసే ఈవెంట్స్, పార్టీలు అటెండ్ చేస్తూ “క్యూట్ కపుల్”గా కనిపించారు.
అయితే, ఈ మధ్య ఇద్దరూ పబ్లిక్‌గా కలిసి కనిపించడం మానేశారు. వాటిపై ఎవ్వరూ అధికారిక ప్రకటన చేయకపోయినా, వీరి సన్నిహితులు మాత్రం “వీరు విడిపోయారు” అని అంటున్నారు. బాలీవుడ్ బజ్ ప్రకారం చూస్తే.. విజయ్ వర్మ ఇప్పుడు మరో నటి ఫాతిమా సనా షేక్‌తో రిలేషన్లో ఉన్నాడని జోరుగా వార్తలు వచ్చాయి. ఇటీవల వీరిద్దరూ ముంబైలో ఓ కేఫ్ దగ్గర ఎంతో క్లోజ్‌గా కనిపించారని చెబుతున్నారు. దీంతో వీరి మధ్య కొత్త సంబంధం మొదలైందని ఊహాగానాలు మొదలయ్యాయి. విజయ్ – ఫాతిమా కలిసి ‘గుస్తాఖ్ ఇష్క్’ అనే సినిమాలో నటిస్తున్నారని, షూటింగ్ సందర్భంగానే వారు క్లోజ్‌గా కనిపించారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వారిద్దరూ మంచి ఫ్రెండ్స్ మాత్రమేనని, ప్రేమ వ్యవహారమేమీ లేదని కొందరు చెబుతున్నారు.
అయితే రూమర్స్ జోరుగా స్ప్రెడ్ అవుతున్న నేపథ్యంలో ఫాతిమా తాను నటించిన ‘మెట్రో ఇన్ డినో’ ప్రచార కార్యక్రమాల్లో .. తాను ఇంకా ఒంటరిగానే ఉన్నానని ధృవీకరించారు. ఒకరితో రిలేషన్ షిప్ కొనసాగించాలి అంటే ఇద్దరు వ్యక్తులు ఒకరినొకరు గౌరవించుకోవాలని చెప్పింది. ఒకరి ఆలోచనలు, అభిప్రాయాలను చర్చించుకొని ఇద్దరూ సమానంగా రాజీకి రావాలని కూడా చెప్పుకొచ్చింది. మరి మీ ఆలోచనలకి సరిపోయే వ్యక్తి మీకు దొరికాడా అన్నప్రశ్నకి ఫాతిమా అచ్చే లడ్కే హై హాయ్ నై యార్… కోయి భీ నహీ హై మేరీ లైఫ్ మే.. ఫిల్మోన్ మే అచ్చే హోతే హై అని చెప్పుకొచ్చింది. అంటే ఆమె మాటలని బట్టి చూస్తే తాను ఇంకా సింగిల్ అని అర్ధమవుతుంది. ఫాతిమా సనా షేక్‌కి ‘దంగల్’ సినిమాతో ఫుల్ ఫేమస్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఆమె ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’, ‘లూడో’, ‘థార్’, ‘సామ్ బహదూర్’ వంటి సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది.