ఆదిలాబాద్ : తెలంగాణ మంత్రులకు పెను ప్రమాదం తప్పింది. ఆదిలాబాద్( Adilabad) జిల్లా పర్యటనలో భాగంగా గురువారం జిల్లా కేంద్రానికి వచ్చిన మంత్రులు జూపల్లి కృష్ణారావు ( Minister Jupalli Krishna Rao) , వివేక్ వెంకటస్వామి ( Vivek Venkata Swamy) స్థానిక గాంధీ పార్క్లో గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతుండగా పక్కనే ఉన్న ఓ చెట్టు కొమ్మ విరిగి కిందపడింది. సమయానికి ఆ చెట్టు కొమ్మ పడ్డ స్థలంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.