Kannappa Movie | మంచు విష్ణు (Manchu Vishnu) కథానాయకుడిగా వస్తున్న తాజా చిత్రం ‘కన్నప్ప’ (Kannappa). మోహన్ బాబు నిర్మాణంలో వస్తున్న ఈ చిత్రానికి మహాభారతం సీరియల్ ఫేమ్ ముఖేష్‌కుమార్ సింగ్ (Mukesh Kumar Singh) దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న విషయం తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ మూవీని డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే మూవీ నుంచి ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్ విడుదల చేయగా హాలీవుడ్ లెవల్లో ఉన్న ఈ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అయితే ఈ సినిమా నుంచి మరో క్రేజీ అప్డేట్ను పంచుకున్నారు మేకర్స్.
ఈ మూవీ నుంచి ఒక్కొక్క పాత్రను చిత్రయూనిట్ విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే తమిళ నటుడు శరత్ కుమార్ పాత్రను విడుదల చేసిన మేకర్స్ తాజాగా ఒకప్పటి స్టార్ నటి మధుబాల పాత్రను రివీల్ చేశారు. ఈ సినిమాలో మధుబాల పన్నగ(Pannaga) అనే చెంచుల దొరసాని పాత్రలో కనిపించబోతున్నట్లు పోస్టర్‌ను విడుదల చేశారు. చెంచులు చేపట్టిన కత్తులు వాళ్ళ విజయాన్ని చెక్కుతాయి…! అడ్డు పెట్టిన డాలులు శత్రు దాడిని అడ్డుకుంటాయి…! మాతృస్వామ్య వ్యవస్థ ఆనవాళ్ళు… నారీకోన మహారాణి పన్నగ, ఆమె కుమార్తె…. వీరనారి నెమలి, సదా యుద్ధానికి సిద్దం. అంటూ పోస్టర్ మీదా రాసుకోచ్చారు.
Presenting #Madhubala as #Pannaga; The chief of clan with her fierce & dare-devil spirit she is a force to be reckoned with 🔥#Madhoo #Kannappa🏹 #HarHarMahadevॐ@themohanbabu @ivishnumanchu @Mohanlal #Prabhas @akshaykumar @realsarathkumar @mukeshvachan @MsKajalAggarwal… pic.twitter.com/1qnbiXwQEq
— Kannappa The Movie (@kannappamovie) July 29, 2024
మరోవైపు ఈ సినిమాలో శరత్ కుమార్ నాథనాధుడు అనే కోయ దొర పాత్రలో కనిపించబోతున్నట్లు ప్రకటించారు. ఈ కోయలు పాండవ రాజు భీమసేనుడు – హిడింబి వారసులు. వీళ్ల నాయకుడు నాథనాధుడు అంటూ తెలిపారు.
ఈ చిత్రంలో బాలీవుడ్ యాక్టర్ అక్షయ్‌కుమార్ కన్నప్పలో శివుడిగా కనిపించబోతున్నాడు. గ్లోబల్ స్టార్ ప్రభాస్, కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు, మోహన్ లాల్, నయనతార, మధుబాల, శివరాజ్‌కుమార్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీకి మెలోడీ బ్రహ్మ మణిశర్మ, స్టీఫెన్ దేవసి మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సమకూరుస్తున్నారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, Ava Entertainment బ్యానర్లపై భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి పరుచూరి గోపాలకృష్ణ, బుర్రా సాయిమాధవ్, తోట ప్రసాద్ స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు.
Also Read..