పారిస్: బ్రిటన్ స్విమ్మర్ టామ్ డాలే(Tom Daley).. చరిత్ర సృష్టించాడు. ఒలింపిక్స్‌లో అతను అయిదో మెడల్ సాధించాడు. పారిస్ క్రీడల్లో మెన్స్ సింక్రోనైజ్డ్ 10 మీటర్ల ఫ్లాట్‌ఫామ్‌లో అతను ఇవాళ సిల్వర్ పతకాన్ని గెలుచుకున్నాడు. నోహా విలియమ్స్‌తో కలిసి అతను స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొన్నాడు. ఫైనల్ డైవ్‌లో చైనా 103.23 స్కోర్ చేసి గోల్డ్ మెడల్ సొంతం చేసుకున్నది. ఇప్పటి వరకు స్విమ్మింగ్‌లో మూడు రజత, ఒక స్వర్ణ, ఒక కాంస్య పతకాన్ని టామ్ డాలే కైవసం చేసుకున్నాడు. రెండో సారి ఒలింపిక్స్ లో ఆడుతున్న విలియమ్స్‌కు ఇది తొలి మెడల్.
Exceptional! 🤩
Tom Daley and Noah Williams secure a stunning silver in an epic men’s synchronised 10m platform final. 👏#Paris2024 pic.twitter.com/0birASHkHX
— Team GB (@TeamGB) July 29, 2024