Coolie | కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్(Rajinikanth) కాంబినేషన్లో వస్తున్న తాజా చిత్రం ’కూలీ’. సన్‌పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధిమారన్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుండగా.. తలైవ కెరీర్లో ఇది 171వ సినిమా. సౌత్ ఇండియన్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఇదిలావుంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఇక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
ఇప్పటికే ఈ సినిమా కోసం మలయాళ నటుడు ఫహద్ ఫాసిల్‌తో పాటు టాలీవుడ్ నటుడు అక్కినేని నాగార్జున నటించబోతున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా మరో స్టార్ హీరో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర నటిస్తున్నట్లు సమాచారం. అయితే ఉపేంద్ర ఫుల్ టైం రోల్ కాకుండా కామియో రోల్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఉపేంద్ర సినిమాల విషయానికి వస్తే.. ఆయన ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘UI’. దాదాపు ఏడేళ్లు గ్యాప్ తీసుకొని ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా.. ఉపేంద్రకు జోడీగా రీష్మా నానయ్య నటిస్తుంది. మనోహరన్ – శ్రీకాంత్ కేపి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాంతర ఫేమ్ అజనీష్ లోకనాథ్ సంగీతం సమకూర్చుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కాగా.. ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు.
Also Read..