woman kidnapped and Raped | సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తి.. మహిళను కిడ్నాప్ చేసి, డ్రగ్స్ ఇచ్చి అత్యాచారం
woman kidnapped and Raped | సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తి ఒక మహిళను కిడ్నాప్ చేశాడు. డ్రగ్స్ ఇచ్చి కారులో అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ మహిళను ఆమె ఇంటి వద్ద దింపేందుకు ప్రయత్నించగా కొందరు వ్యక్తులు గమనించారు. కారును అడ్డుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు.
బెంగళూరు: సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తి ఒక మహిళను కిడ్నాప్ చేశాడు. డ్రగ్స్ ఇచ్చి కారులో అత్యాచారానికి పాల్పడ్డాడు. (woman kidnapped and Raped) ఆ మహిళను ఆమె ఇంటి వద్ద దింపేందుకు ప్రయత్నించగా కొందరు వ్యక్తులు గమనించారు. కారును అడ్డుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఒక మహిళకు ఇన్స్టాగ్రామ్లో వ్యక్తి పరిచయమయ్యాడు. శుక్రవారం కర్కాలకు కారులో వచ్చిన అతడు ఆమెను కిడ్నాప్ చేశాడు. అటవీ ప్రాంతానికి ఆ మహిళను తీసుకెళ్లాడు. ఇద్దరు వ్యక్తులు అక్కడకు వచ్చారు. ఆ వ్యక్తికి బీర్ బాటిల్స్ ఇచ్చారు.
కాగా, బీర్లో డ్రగ్స్ కలిపిన ఆ వ్యక్తి ఆ మహిళతో బలవంతంగా తాగించాడు. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెపై కారులో అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆ మహిళను ఆమె ఇంటి వద్ద కారులో దింపేందుకు ప్రయత్నించాడు. అయితే హిందూ కార్యకర్తలు ఆ కారును అడ్డుకున్నారు. కారులో ఉన్న యువతి మత్తులో ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
మరోవైపు అక్కడకు చేరుకున్న పోలీసులు వైద్య పరీక్షల కోసం ఆ మహిళను ఆసుపత్రికి తరలించారు. ఆ యువతిపై సామూహిక లైంగిక దాడి జరిగినట్లు ఆమె కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. దీంతో నిందితుడితో పాటు అతడి వెంట ఉన్న ఇద్దరు వ్యక్తులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. కిడ్నాప్, అత్యాచారం, ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

