Emergency | బాలీవుడ్ క్వీన్, మండి ఎంపీ కంగనా రనౌత్ (Kangana Ranaut) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఎమర్జెన్సీ’ (Emergency Movie). 1975-77 నాటి ఎమర్జెన్సీ పరిస్థితుల నేపథ్యంలో తెరకెక్కించిన ఈ సినిమాలో కంగనా రనౌత్.. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ (Indira Gandhi) పాత్రను పోషించింది. ఆమె దర్శకురాలు కూడా. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ చిత్రం.. పలు వివాదాల కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. అయితే, ఎట్టకేలకు తాజాగా ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది.
ఈ మేరకు ఈ సినిమా రిలీజ్ డేట్ను తాజాగా చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. వచ్చే ఏడాది జనవరి 17న ‘ఎమర్జెన్సీ’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని కంగనా రనౌత్ స్వయంగా ఎక్స్ వేదికగా ప్రకటించారు. ‘భారత దేశంలో శక్తిమంతమైన మహిళ చరిత్ర, దేశ విధిని మార్చిన క్షణాలు వచ్చే ఏడాది జనవరి 17న మీ ముందుకు రాబోతున్నాయి’ అంటూ పేర్కొన్నారు.
17th January 2025 – The epic saga of the nation’s most powerful woman and the moment that altered India’s destiny. #Emergency – Unveils Only in cinemas on 17.01.2025! @KanganaTeam @AnupamPKher #SatishKaushik @shreyastalpade1 #MahimaChaudhry @milindrunning #VishakNair… pic.twitter.com/dC0gnYSNlW
— Kangana Ranaut (@KanganaTeam) November 18, 2024
మాజీ ప్రధాని ఇందిరా గాంధీ 1972లో విధించిన ఎమర్జెన్సీ కాలంనాటి రాజకీయ పరిణామాల గురించి ఈ సినిమాలో వివరించారు. అయితే, సిక్కుల మతస్థుల మనోభావాలు దెబ్బతీలా ఈ సినిమా తీశారని ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్మెంట్ కమిటీ ఆరోపించింది. అకాల్ తఖ్త్ సాహిబ్పై బాంబు దాడి, ఆపరేషన్ బ్లూ స్టార్, ఎమర్జెన్సీ టైంలో చోటుచేసుకున్న కొన్ని సంఘటనలను విస్మరిస్తూ.. కథను పూర్తిగా ఒకవైపు మాత్రమే చూపించారని కొన్ని వర్గాలు ఎమర్జెన్సీ సినిమాని వ్యతిరేకించాయి. మరోవైపు ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది. సినిమాలు మతపరమైన మనోభావాలను దెబ్బతీయకూడదని బోర్డు సూచించింది. సినిమాలో సెన్సిటివ్ కంటెంట్ ఉందని CBFC తెలిపింది.
ఈ సినిమాలో సిక్కుల మనోభావాలను కించపరిచే సన్నివేశాలు ఉన్నాయని, ఆపరేషన్ బ్లూస్టార్ నేపథ్యంలో తీసిన సన్నివేశాలు వివాదాస్పదంగా ఉన్నాయని సెన్సార్ బోర్డ్ విడుదలకు అనుమతిని నిరాకరించింది. ఈ కారణాలతో ఎమర్జెన్సీ చిత్రానికి సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ కూడా ఇవ్వలేదు. దీంతో కంగన టీమ్ బాంబే హైకోర్టు (Bombay High Court)ను ఆశ్రయించింది. కోర్టు జోక్యంతో సినిమాలో కొంత సున్నితమైన కంటెంట్ ఉందని.. వాటిని తొలగిస్తే సర్టిఫికెట్ ఇస్తామని సెన్సార్ బోర్డు తెలిపింది. సెన్సార్ బోర్డు సినిమాలో 13 కట్లతో పాటు మార్పులు చేసింది. అందుకు నిర్మాణ సంస్థ కూడా అంగీకరించడంతో ఈ చిత్ర వివాదం ఓ కొలిక్కి వచ్చింది. చివరికి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
‘ఎమర్జెన్సీ’ చిత్రంలో జయప్రకాష్ నారాయణ్ పాత్రలో అనుపమ్ ఖేర్, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయీ పాత్రలో శ్రేయస్ తల్పడే కనిపించనున్నారు. జీ స్టూడియోస్, మణికర్ణిక ఫిలిమ్స్ బ్యానర్లు నిర్మిస్తున్న ఈ చిత్రంలో మహిమా చౌదరి, మిలింద్ సోమన్, తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
Also Read..
Kasthuri | ఆ వార్తలు అవాస్తవం.. నేనెక్కడికీ పారిపోలేదు : కస్తూరి
Sri Simha | కీరవాణి ఇంట పెళ్లి సందడి.. శ్రీ సింహా ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్.. ఫొటోలు
Nayanthara | ఫ్యామిలీతో కలిసి కుతుబ్మినార్ను సందర్శించిన లేడీ సూపర్ స్టార్.. వీడియోలు