Sri Simha | ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్.ఎమ్. కీరవాణి (MM Keeravani) ఇంట్లో పెళ్లి సందడి నెలకొంది. ఆయన చిన్న కుమారుడు శ్రీ సింహా (Sri Simha) త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. సీనియర్ నటుడు మురళీ మోహన్ (Murali Mohan) మనవరాలు రాగ మాగంటి (Raaga Maganti)ని వివాహం చేసుకోబోతున్నాడు.
ఇందులో భాగంగా ఆదివారం రాత్రి ప్రీ వెడ్డింగ్ వేడుకను ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ గోల్కొండ రిసార్ట్స్‌లో జరిగిన ఈ సెలబ్రేషన్స్‌కు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. దర్శకుడు, కీరవాణి సోదరుడు ఎస్ఎస్ రాజమౌళి ఫ్యామిలీతోపాటు స్టార్ హీరో మహేశ్ బాబు, సితార, నరేశ్, పవిత్రా లోకేశ్ తదితరులు హాజరై కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. ఈ ప్రీవెడ్డింగ్ వేడుకలకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.
కాగా, శ్రీ సింహా ఇటీవలే ‘మత్తు వదలరా 2’(Mathu Vadalara 2) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ మూవీ ‘మత్తు వదలరా’(Mathu Vadalara)కు సీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రానికి రితేశ్ రానా దర్శకత్వం వహించాడు. జాతి రత్నాలు ఫేం ఫరియా అబ్దుల్లా ఫీ మేల్ లీడ్ రోల్లో నటించింది. క్రైమ్ కామెడీగా సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అందుకుంది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది.
Actor #SriSimha is getting married to ‘Raaga Maganti,’ the granddaughter of #MuraliMohan. pic.twitter.com/xWgwA7KRt6
— KLAPBOARD (@klapboardpost) November 17, 2024
He looked much more handsome 😍 when I saw him very close at Sri simha Wedding Reception.#SSMB29 will take telugu cinema to many more heights in world cinema💥 #Globetrotting#MaheshBabu𓃵 #srisimha #SSRajamouli pic.twitter.com/ihxDy94cA7
— imuday_09 (@imuday13) November 17, 2024
Also Read..
Medical Student | ర్యాగింగ్ పేరిట మూడు గంటలు నిల్చోబెట్టిన సీనియర్లు.. వైద్య విద్యార్థి మృతి
Ambulance | అంబులెన్స్‌కు దారివ్వని వ్యక్తి.. రూ.2.5 లక్షల జరిమానా
Delhi Pollution | ఢిల్లీలో మరింత క్షీణించిన గాలి నాణ్యత.. ఇవాల్టి నుంచి కఠిన ఆంక్షలు