Kangana Ranaut | బాలీవుడ్ స్టార్ నటి, మండి లోక్‌సభ నియోజకవర్గ బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ (Kangana Ranaut) నివాసానికి రూ.లక్ష కరెంటు బిల్లు (electricity bill) వచ్చింది. ఆ బిల్లు చూసి నటి ఒక్కసారిగా షాక్ అయ్యింది. ఈ మేరకు హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh)లోని కాంగ్రెస్ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో మండిపడింది. తాను అసలు ఆ ఇంట్లోనే ఉండటం లేదని.. అలాంటప్పుడు రూ.లక్ష కరెంటు బిల్లు ఎలా వస్తుందని ప్రశ్నించింది.
మీడియాతో బుధవారం నటి మాట్లాడారు. మనాలి (Manali)లోని తన నివాసానికి రూ.లక్ష కరెంటు బిల్లు వచ్చినట్లు చెప్పారు. ఈ మధ్య కాలంలో తాను అసలు ఆ ఇంట్లోనే ఉండటం లేదని తెలిపారు. అలాంటప్పుడు అంత బిల్లు ఎలా వస్తుందని ప్రశ్నించారు. ఆ బిల్లు చూసి తాను షాక్‌కు గురైనట్లు చెప్పారు. హిమాచల్ ప్రదేశ్‌లో ఇలాంటి పరిస్థితులు సిగ్గు చేటు అని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఉన్న సోదరీ సోదరులను తాను ఒకటి కోరుతున్నానని, అందరం కలిసి సమస్యలపై క్షేత్ర స్థాయిలో పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. దేశం, రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. తోడేళ్ల చెర నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుందాం అంటూ నినదించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
Also Read..
Mallikarjun Kharge | మోదీ ఏదో ఒకరోజు దేశాన్ని అమ్మేస్తాడు : మల్లికార్జున్ ఖర్గే
PM Modi: భారతదేశ ఐడెంటిటీలో జైన మతం కీలక పాత్ర పోషించింది: ప్రధాని మోదీ
PM Modi | విక్టరీ డే పరేడ్.. ప్రధాని మోదీని ఆహ్వానించిన రష్యా