న్యూఢిల్లీ: భారత దేశానికి గుర్తింపు తీసుకురావడంలో.. జైన మతం వెలకట్టలేని పాత్రను పోషించిందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రపంచానికి సవాళ్లుగా మారిన ఉగ్రవాదం, యుద్ధం, పర్యావరణ పరిరక్షణ లాంటి సమస్యలకు.. జైన మత విలువలు సమాధానం ఇవ్వగలవన్నారు. నవకర మహామంత్ర దివస్ సందర్భంగా ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. ప్రాచీన మతానికి చెందిన సంప్రదాయాన్ని, వారసత్వాన్ని, ప్రబోధనలను రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మోదీ తెలిపారు. పార్లమెంట్ బిల్డింగ్ లో జైన తీర్థంకరుల విగ్రహాలు ఉన్నట్లు చెప్పారు.
Navkar Mahamantra embodies humility, peace and universal harmony. Delighted to take part in the Navkar Mahamantra Divas programme. https://t.co/4f4r6ZuVkX
— Narendra Modi (@narendramodi) April 9, 2025
జైన మతంలో ఉన్న అనేకాంతవాదం గురించి ఆయన ప్రస్తావించారు. నిజం అనేది అనేక రూపాల్లో వ్యక్తం అవుతుందన్నారు. జైన మతంలో ఒకరిపై ఒకరు ఆధారపడుతారన్న వాస్తవాన్ని గుర్తింపు ఉందని, అందుకే వాళ్లు స్వల్ప స్థాయిలో కూడా హింసను ఆమోదించరన్నారు. శాంతి, సామర్యం, పర్యావరణ పరిరక్షణలో ఇదే కీలకం అన్నారు. భారతీయ ఆధ్యాత్మిక వైభవానికి జైన సాహిత్యం వెన్నుముకగా నిలుస్తుందన్నారు.