ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి బాలీవుడ్ (Bollywood) క్వీన్‌గా మంచి పాపులారిటీ సంపాదించింది కంగనారనౌత్ (Kangana Ranaut). ఈ హిమాచల్ ప్రదేశ్ సుందరి గ్లామరస్ పాత్రలతోనేకాదు..యాక్షన్, పర్ ఫార్మెన్స్ ఓరియెంటెడ్ సినిమాలతో కోట్లాదిమంది ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించింది. కంగనా తాజాగా కొత్త సినిమా ప్రకటించడమే..పూజా కార్యక్రమాలతో షురూ కూడా చేసేసింది. ఈ బ్యూటీ నటిస్తోన్న తాజా చిత్రం ఎమర్జెన్సీ (Emergency).
పూజా కార్యక్రమాలతో లాంఛింగ్ చేసిన స్టిల్‌ను ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్‌లో రాసుకొచ్చింది. తన హోం బ్యానర్ మణి కర్ణిక ఫిలిమ్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలపై త్వరలోనే స్పష్టత రానుంది. ఈ చిత్రానికి టెస్టుయో నగట సినిమాటోగ్రాఫర్ కాగా..జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ డైరెక్టర్. టైటిల్‌తో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్న కంగనా ఇంతకీ ఎలాంటి కథాంశంతో సినిమా చేస్తుందనే విషయాన్ని మాత్రం చెప్పకుండా సస్పెన్స్ పెట్టింది.
ఈ ఏడాది ధాకడ్ (Dhaakad) సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది కంగనా. ఈ చిత్రం బాక్సాపీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ప్రస్తుతం తేజాస్ సినిమాలో నటిస్తోంది. దీంతోపాటు టికు వెడ్స్ షేరు చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తోంది.
Read Also : Pavitra lokesh | నరేశ్ మంచి వ్యక్తి..మీడియాతో పవిత్రా లోకేశ్..తెరపైకి మూడో భార్య..!