Kangana Ranaut | బాలీవుడ్లో సూపర్ క్రేజ్ ఉన్న సెల్ఫ్‌మేడ్ స్టార్ హీరోయిన్లలో టాప్‌లో ఉంటుంది కంగనారనౌత్ (Kangana Ranaut). ఏక్ నిరంజన్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను కూడా పలుకరించిన ఈ భామకు సౌత్‌లో కూడా ఫ్యాన్ బేస్ ఎక్కువే. గతేడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మండి లోక్ సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా కూడా గెలుపొంది చట్ట సభల్లోకి అడుగుపెట్టింది. అయితే ఈ యాక్టర్ కమ్ పొలిటీషియన్ చాలా కాలం తర్వాత ఎమర్జెన్సీ (Emergency ) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాలనలో 1975 జూన్ 25 నుండి 1977 వరకు కొనసాగిన ఇండియన్ ఎమర్జెన్సీఆధారంగా తెరకెక్కిస్తున్నారు. పొలిటికల్ డ్రామా నేపథ్యంలో వస్తోన్న ఈ చిత్రంలో కంగనారనౌత్ ఇందిరాగాంధీ పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే విడుదల చేసిన ఎమర్జెన్సీ ట్రైలర్‌కు మంచి స్పందన రావడమే కాదు.. ఇందిరాగాంధీ పాత్రలో కంగనాజీవించేసిందని అంటున్నారు సినీ జనాలు. జనవరి 17న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో కంగనా రనౌత్ ప్రమోషన్స్ కోసం చాలా రోజుల తర్వాత మళ్లీ ట్రెండీ అవతార్‌లో ప్రత్యక్షమైంది. ఎమర్జెన్సీ ప్రమోషన్స్‌లో వైట్ అండ్ వైట్ డ్రెస్‌లో మెరిసిపోయింది. బాలీవుడ్ దర్శకనిర్మాత, నటుడు అనుపమ్ ఖేర్‌తో కలిసి ప్రమోషన్స్‌లో పాల్గొంది. ఫ్యాషన్ ఐకాన్‌గా మారిపోయిన బాలీవుడ్ క్వీన్ విజువల్స్ ఇప్పుడు నెటిజన్లకు కంటి మీదు కనుకు లేకుండా చేస్తున్నాయి.
ఎమర్జెన్సీ సమయంలో పౌరహక్కుల సస్పెన్షన్, ఇందిరా గాంధీ వ్యతిరేకుల అరెస్టుతోపాటు పలు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయని తెలిసిందే. ఎమర్జెన్సీ టైంలో ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా నిలబడ్డ ప్రముఖ రాజకీయ వేత్త జయప్రకాశ్ నారాయణ్ (జేపీ) పాత్రలో పాపులర్ బాలీవుడ్ దర్శకనిర్మాత అనుపమ్ ఖేర్ నటిస్తుండగా.. శ్రేయాస్ తల్పడే, భూమికా చావ్లా ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రాన్ని కంగనా హోం బ్యానర్ మణి కర్ణిక ఫిలిమ్స్ బ్యానర్‌పై రేణు పిట్టి, కంగనారనౌత్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
ఎమర్జెన్సీ ప్రమోషన్స్‌లో..
Kangana Ranaut and Anupam Kher were spotted together in Juhu as they promoted their highly anticipated film Emergency.#KanganaRanaut #Emergency#EmergencyTrailer pic.twitter.com/9CdkoBTZ2Y
— Rahul Chauhan (@RahulCh9290) January 6, 2025
#KanganaRanaut‘s cute 🥰 nephew Ashwatthama pic.twitter.com/rXXHF66Mh6
— Anjali Prakash (@anjaliprakash05) January 7, 2025