Emergency twitter review | బాలీవుడ్లో ఉన్న సెల్ఫ్‌మేడ్ లేడీ యాక్టర్లలో టాప్‌లో ఉంటుంది కంగనారనౌత్ (Kangana Ranaut). గ్లామరస్ పాత్రలతోపాటు పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ సినిమాలతో సూపర్ ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. చాలా కాలంగా మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న ఈ యాక్టర్ కమ్ పొలిటిషియన్ తాజాగా ఎమర్జెన్సీ (Emergency) సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రాన్ని దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పాలనలో 1975 జూన్ 25 నుండి 1977 వరకు కొనసాగిన ఇండియన్ ఎమర్జెన్సీ ఆధారంగా తెరకెక్కించారు.
ఎమర్జెన్సీ సమయంలో పౌరహక్కుల సస్పెన్షన్, ఇందిరా గాంధీ వ్యతిరేకుల అరెస్టుతోపాటు పలు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయని తెలిసిందే. ఎమర్జెన్సీ టైంలో ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా నిలబడ్డ ప్రముఖ రాజకీయ వేత్త జయప్రకాశ్ నారాయణ్ (జేపీ) పాత్రలో పాపులర్ బాలీవుడ్ దర్శకనిర్మాత అనుపమ్ ఖేర్ నటించగా.. అటల్ బిహారీ వాజ్‌పేయిగా శ్రేయాస్ తల్పడే, భూమికా చావ్లా ఇతర కీలక పాత్రలు పోషించారు.
పొలిటికల్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కంగనారనౌత్ ఇందిరాగాంధీ పాత్రలో నటించింది. నేడు (జనవరి 17న) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది. ఓ వైపు లీడ్ రోల్లో నటిస్తూనే.. మరోవైపు డైరెక్టర్‌గా మెగాఫోన్ పట్టింది. మరి కంగన రనౌత్ ఎమర్జెన్సీ గురించి నెట్టింట టాక్ ఎలా ఉందో తెలుసుకుందాం.
నెట్టింట టాక్ ఇలా..
#KanganaRanaut isn’t just playing Indira Gandhi, she is Indira Gandhi. The body language, the voice, the presence 💯💯
The #Emergency was one of the darkest times in Indian history, and this film doesn’t sugarcoat it. Some scenes made me uncomfortable (as they should). Vishak… pic.twitter.com/MoYFiBHRFt— POOJA DUBEY (@poojavdubey) January 17, 2025
కంగనారనౌత్ ఇందిరా గాంధీ పాత్ర పోషించడమే కాదు. ఆమె బాడీ లాంగ్వేజ్, వాయిస్, ఉనికి అచ్చు ఇందిరా గాంధీని దింపేశాయి. భారత చరిత్రలో అత్యంత చీకటి సమయాల్లో ఒకటి ఎమర్జెన్సీ . కొన్ని సన్నివేశాలు అసౌకర్యంగా అనిపించాయి. సంజయ్ గాంధీగా విశాక్ నాయర్ అద్భుతంగా నటించారు. ఇది పక్కా పొలిటికల్ మూవీ.
#Emergency This is the best biopic made on any Indian politician. #KanganaRanaut is outstanding as both actress and director
National award fix🏆
Each and everyone in the film nailed it🔥 special mention Vishak nair as Sanjay gandhi 🔥
And shreyas sir and anupam kher3.75/5⭐ pic.twitter.com/4yERboZxXc
— Deekshith Udupi (@Dixithh_Poojary) January 17, 2025
ఇప్పటివరకు భారతీయ రాజకీయ నాయకులపై తీసిన సినిమాల్లో అత్యుత్తమ బయోపిక్ ఇది. ఓ వైపు నటిగా.. మరోవైపు దర్శకురాలిగా కంగనా రనౌత్ అద్భుతంగా మెప్పించింది. నేషనల్ అవార్డు పక్కా. సినిమాలోని ప్రతి ఒక్కరూ అద్భుతంగా నటించారు. సంజయ్ గాంధీగా నటించిన విశాఖ నాయర్‌ను ప్రత్యేకంగా ప్రశంసించాల్సిందే. శ్రేయాస్ తల్పడే, అనుపమ్ ఖేర్ అద్భుతంగా నటించారు.
#EmergencyReview – “Kangana is Indira, and Indira is Kangana” – That’s something you feel after watching #KanganaRanaut excel hugely in her portrayal of India’s ex-PM #IndiraGandhi ma’m in #Emergency.
The portrayal is picture perfect and the drama is enthralling. She represents… pic.twitter.com/TKav4Q8SBR
— Joginder Tuteja (@Tutejajoginder) January 17, 2025
కంగనా ఇందిరే, ఇందిరే కంగనా. ఎమర్జెన్సీలో భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ మేడమ్ పాత్రలో కంగనారనౌత్ అద్భుతంగా రాణించిన తీరు చూసిన తర్వాత మీకు అనిపించేది ఇదే. మేకింగ్ అద్భుతం. డ్రామా ఇంటెన్సివ్‌గా ఉంది.
భారతదేశ చరిత్రలోని కీలకమైన దశలో ప్రాతినిధ్యం వహించిన ఒక మానవతామూర్తిని.. ముఖ్య భూమిక పాత్ర పోషించిన సంఘటనలను కూడా వివరిస్తుంది.
అనుపమ్ ఖేర్, శ్రేయాస్ తల్పడే, సతీష్ కౌశిక్, మిలింద్ సోమన్, విశాక్ నాయర్ లాంటి దిగ్గజ నటులతో చెప్పిన స్టోరీ టెల్లింగ్ బాగుంది. ఈ సినిమా సాంకేతిక అంశాలపై కంగనాకు ఉన్న పట్టును చూపిస్తుంది. దర్శకురాలిగా, నటిగా కంగనా బాగానే మెప్పించింది.
మీరు చరిత్రలోని కీలక భాగాన్ని సిల్వర్ స్క్రీన్‌పై చూడాలనుకుంటే ఎమర్జెన్సీకి వెళ్లొచ్చు.
ఈ చిత్రాన్ని కంగనా హోం బ్యానర్ మణి కర్ణిక ఫిలిమ్స్ బ్యానర్‌పై రేణు పిట్టి, కంగనారనౌత్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
Naga Chaitanya | మాటిచ్చిన తండేల్ రాజు.. చేపల పులుసు వండిన నాగచైతన్య