యూనివర్సల్ యాక్టర్ కమల్ హాసన్ (kamal haasan) నటిస్తోన్న తాజా ప్రాజెక్టు విక్రమ్ (Vikram). లోకేశ్ కనగరాజ్ (Lokesh kanagaraj) డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్, సూర్య కీ రోల్స్ పోషిస్తున్నారు. జూన్ 3న వరల్డ్ వైడ్‌గా విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో కమల్ హాసన్ తన స్నేహితుడు, లెజెండరీ యాక్టర్ రజినీకాంత్ (Rajinikanth )ను చెన్నైలోని ఆయన నివాసంలో ఇవాళ కలిశారు. డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్, ఆర్ మహంద్రన్ కూడా రజనీకాంత్‌ను కలిసిన వారిలో ఉన్నారు.
ఇంతకీ రజినీకాంత్‌ను కలవడానికి కారణమేంటనే దానిపై అఫీషియల్ అప్ డేట్ లేదు. అయితే విక్రమ్ టీం స్పెషల్ ప్రీమియర్‌కు రావాలని తలైవాను ఆహ్వానించినట్టు తెలుస్తోండగా..దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. మరోవైపు రజినీకాంత్ విక్రమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఏమైనా రాబోతున్నారా..? అన్న చర్చ కూడా నడుస్తోంది. తెలుగు, తమిళం, హిందీతోపాటు దక్షిణాది భాషల్లో విడుదలవుతున్న విక్రమ్ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ డైరెక్టర్.
యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తున్న విక్రమ్ తెలుగు ప్రీ రిలీజ్ఈవెంట్ (Pre Release Event)ను హైదరాబాద్‌లో నిర్వహించబోతున్నారు. మే 31న శిల్పకళావేదికలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగనుంది. ఇద్దరు లెజెండరీ యాక్టర్లు చాలా కాలం తర్వాత ఒకే ఫ్రేమ్‌లో కనిపించిన తాజా స్టిల్ ఇపుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.