Kamal Haasan | మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా ‘ప్రాజెక్ట్ K’ వర్కింగ్ టైటిల్ తో సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా టైటిల్ అండ్ గ్లింప్స్ ను శాన్ డిగో కామిక్ కాన్ (Comic-Con in San Diego) ఈవెంట్లో లాంచ్ చేశారు. ఈ చిత్రానికి ‘కల్కి 2898 AD’ (Kalki 2898-AD) అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ వేడుకకు దర్శకుడు నాగ్ అశ్విన్, హీరోలు ప్రభాస్, కమల్ హాసన్ (Kamal Haasan), రానా, నిర్మాత అశ్వినీ దత్ తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) వర్చువల్ గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమల్ – అమితాబ్ మధ్య జరిగిన సరదా సంభాషణ నెట్టింట వైరల్ అవుతోంది.
కార్యక్రమంలో భాగంగా కమల్, బిగ్ బీ ఒకరిపై ఒకరు ప్రశంసలు కురిపించుకున్నారు. ‘మన ప్రేక్షకులు మన సినిమాలకు ఇచ్చే గొప్పతనం ఏంటంటే.. మేము సినిమా కథలను తయారు చేస్తే వాళ్లు హీరోలను తయారు చేస్తారు’ అంటూ వ్యాఖ్యానించారు. అదేవిధంగా అమితాబ్ బచ్చన్, ప్రభాస్ వంటి గొప్ప నటులతో పాటు ఇక్కడ ప్రేక్షకుల మధ్యలో కూర్చోవడం గొప్ప వరం అని అన్నారు. ఇంతలో అమితాబ్ కలగజేసుకొని ‘మీరు అంత నిరాడంబరంగా ఉండకండి కమల్, వాస్తవానికి మీరు మా అందరికంటే గొప్పవారు’ అంటూ చమత్కరించారు.
అదేవిధంగా ‘ కమల్ చేసిన సినిమాలు వాస్తవికతను చూపుతాయి. ఆయన సినిమాల కోసం ఎంతో కష్టపడతారు. కమల్ పోషించిన పాత్రలు అద్భుతం. అతడిలా నటించడం చాలా కష్టం. ఈ సినిమాలో ఆయనతో కలిసి నటించడం ఓ గౌరవంగా భావిస్తున్నాను. మేము ఇంతకు ముందు కూడా రెండు సినిమాల్లో చేశాం. కానీ ఇది చాలా స్పెషల్’ అని బిగ్ బీ తెలిపారు.
అనంతరం కమల్ మాట్లాడుతూ.. అమితాబ్ ఎన్నో గొప్ప సినిమాలు చేశారని సినిమా కోసం ఆయన ఎంతో కష్టపడతారని అన్నారు. ఈ సందర్భంగా బిగ్ బీ నటించిన ‘షోలే’ (Sholay) సినిమా నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ‘అమితాబ్ నటించిన షోలే సినిమాకు నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాను. ఈ సినిమా చూసిన రాత్రి నేను అసలు నిద్రపోలేదు. ఎందుకంటే ఆ సినిమాను చాలా ద్వేషించాను. ఆ సినిమా తీసిన వ్యక్తిని మరింత ద్వేషించా. ఓ గొప్ప ఫిల్మ్ మేకర్ తో కలిసి పనిచేసే అవకాశం నాకు వచ్చింది. ఇదే విషయాన్ని రమేష్ సిప్పీకి కూడా చెప్పాను. ఆ సినిమాకు పనిచేసిన ఓ టెక్నీషియన్ గా ఆ రోజు రాత్రి నేను నిద్రపోలేదు. అమిత్ జీ అలాంటి సినిమాలు ఎన్నో చేశారు. అంతటి గొప్ప వ్యక్తి నా సినిమాల గురించి ఇంత గొప్పగా చెబుతాడని నేను ఎప్పుడూ ఊహించలేదు’ అని కమల్ అన్నారు.
Also Read..
Rahul Gandhi | రాహుల్ కు కేరళలో ఆయుర్వేద వైద్యం..!
Parliament Sessions | విపక్షాల ఆందోళన.. లోక్ సభ సోమవారానికి వాయిదా