Lokah Teaser | తెలుగు ప్రేక్షకులకు పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేని భామ కళ్యాణి ప్రియదర్శన్. ఈ భామ నటిస్తోన్న చిత్రాల్లో ఒకటి లోక చాఫ్టర్ 1- చంద్ర. మలయాళ ఫీ మేల్ సూపర్ హీరో సినిమాగా వస్తోంది. ఈ మూవీ టీజర్‌ను బర్త్ డే సందర్భంగా స్టార్ యాక్టర్ దుల్కర్ సల్మాన్ లాంచ్ చేశాడు.
ప్రేమలు ఫేం నస్లెన్ ఈ మూవీలో మరో లీడ్ రోల్లో నటిస్తున్నాడు. ఈ ఓనమ్‌కు థియేటర్లలో లోక ప్రపంచం స్వాగతం పలుకనుంది. టీజర్ వచ్చేసింది.. అంటూ ట్వీట్ చేశాడు దుల్కర్ సల్మాన్. రెండు డిఫరెంట్ టైం లైన్లలో ఈ సినిమా ఉండబోతున్నట్టు టీజర్ హింట్ ఇచ్చేస్తుంది. కళ్యాణి ప్రియదర్శన్‌ను పాత కాలానికి, ప్రస్తుత కాలానికి లింక్ పెడుతూ కట్ టీజర్ చేసిన సినిమాపై హైప్ క్రియేట్ చేస్తోంది.
ఇప్పటివరకు గ్లామరస్ రోల్స్ చేసిన కళ్యాణి ప్రియదర్శన్.. తొలిసారి తన కెరీర్లో సూపర్ హీరో స్టైల్ యాక్షన్ స్టంట్స్ చేయడం విశేషం. చంద్ర పాత్ర చాలా మంది ప్రేక్షకులకు కనెక్ట్ అవనున్నట్టు లోక టీజర్ చెప్పకనే చెబుతోంది.
Lokah టీజర్..
Hathnoora | ఆదాయం ఉన్న సౌకర్యాలు సున్నా.. పలుగు పోచమ్మ ఆలయం వద్ద భక్తుల ఇక్కట్లు
Roads | సారూ మా రోడ్లు బాగు చేయరా.. బురద రోడ్లపై వరినాట్లు వేసి నిరసన
Additional collector Nagesh | ప్రాజెక్టులు, చెరువుల దగ్గరికి ఎవరూ వెళ్లొద్దు : అదనపు కలెక్టర్ నగేష్