Lokah Chapter 1 | ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై బాక్సాఫీస్‌పై దండయాత్ర చేస్తున్న సినిమాల్లో ఒకటిగా నిలుస్తుంది ‘కొత్త లోక చాప్టర్ 1 చంద్ర’ (Lokah Chapter 1 Chandra). మాలీవుడ్ నుంచి మొట్టమొదటి ఫీ మేల్ సూపర్ హీరో సినిమాగా వచ్చిన ఈ చిత్రం ఫస్ట్ డే నుంచి ఏదో ఒక అప్డేట్తో వార్తల్లో నిలుస్తూనే ఉంది.
డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చెన్నై భామ కళ్యాణి ప్రియదర్శన్ (Kalyani Priyadarshan), నస్లేన్ (Naslen) లీడ్ రోల్స్‌లో నటించగా.. టోవినో థామస్, అతిథి పాత్రల్లో నటించారు. ఆగస్టు 28న రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూ నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది.
35 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ కేరళలో న్యూ బెంచ్ మార్క్‌ను క్రియేట్ చేస్తూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది. ఈ మూవీ తాజాగా 300 కోట్ల క్లబ్‌లోకి ఎంటరై హిస్టరీ క్రియేట్ చేసి.. ఇప్పటివరకు ఏ మలయాళ సినిమా కూడా సాధించని అరుదైన ఫీట్‌ను ఖాతాలో వేసుకుంది.సెన్సేషనల్ బాక్సాఫీస్ రన్‌తో ఇప్పటివరకున్న రికార్డులను కొల్లగొట్టి కేరళతోపాటు, ఇండియా, ఓవర్సీస్లో రూ.300 కోట్ల వసూళ్లు రాబట్టి.. ఇండియా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఓవర్సీస్లో అత్యధిక గ్రాస్ సాధించిన మలయాళ సినిమాగా, కేరళలో హయ్యెస్ట్ గ్రాసింగ్ సినిమాగా రికార్డులు క్రియేట్ చేసింది.
ఇదిలా ఉంటే ప్రమోషనల్ ఈవెంట్స్‌లో డొమినిక్ అరుణ్ టీం లోక 5 పార్టుల సిరీస్‌గా రాబోతుందని చెప్పింది. అంతేకాదు ఈ 5 కథలన్నీ ఫస్ట్ పార్ట్ షూటింగ్‌కు ముందే రెడీ అయ్యారని డైరెక్టర్ చెప్పాడు డొమినిక్ అరుణ్ . మొత్తం సిరీస్‌లో ఎవరు విలన్ అనేదానిపై చంద్ర ఓపెనింగ్ సీన్లో హింట్ ఇచ్చేశామని కూడా చెప్పాడు.
#Lokah
Congratulations 🎉
Team Lokah @kalyanipriyan @dominicarun @NimishRavi @dulQuer and the entire team #LokahChapter1 on your brilliant craft works and massive teamwork. 🙏🙌🍒📈#DulquerSalmaan💖💖💖 pic.twitter.com/oN7yI1iEFG— Saseendran P (@SaseendranP12) October 5, 2025
Kayadu Lohar | ఆ సినిమాకు నా హృదయంలో ప్రత్యేక స్థానం.. తెలుగు మూవీపై కయాదు లోహర్