Vijayanthi Movies | ఈ ఏడాది ‘కల్కి’ తో బ్లాక్ బస్టర్ అందుకుంది టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్. ప్రభాస్ కథానాయకుడిగా నాగ్అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. తాజాగా చిత్రం 10 రోజుల్లో రూ.800 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. అయితే ఈ బ్యానర్లో ‘కల్కి’ తరవాత మరో క్రేజీ మూవీ రాబోతున్నట్లు తెలుస్తుంది. మలయాళ కథానాయకుడు దుల్కర్ సల్మాన్‌తో వైజయంతి మరో మూవీ ప్లాన్ చేస్తుంది.
ఇప్పటికే దుల్కర్‌తో ‘మహానటి’, ‘సీతారామం’ ‘కల్కి’ వంటి సూపర్ హిట్లు అందుకున్న వైజయంతి బ్యానర్ తాజాగా మరో సినిమాను అనౌన్స్ చేయబోతుంది. తెలుగు యువ దర్శకుడు పవన్ సాధినేని దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ ఓ సినిమా రూపొందిస్తోంది. లవ్ స్టోరీ కాన్సెప్ట్‌తో వస్తున్న ఇందులో దుల్కర్ కథానాయకుడిగా నటించనున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్ సంబంధించి స్క్రిప్టు పనులు కూడా పూర్తయినట్లు తెలుస్తుంది. కాగా ఈ ప్రాజెక్ట్‌ను జూలై 28 దుల్కర్ సల్మాన్ పుట్టినరోజు సందర్భంగా అధికారికంగా ప్రకటన చేయబోతున్నట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి..