Kalki 2898 AD | బాక్సాఫీస్ బరిలో ‘కల్కి’ జైత్రయాత్ర కొనసాగుతున్నది. ప్రభాస్ కథానాయకుడిగా నాగ్అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ మూవీ కేవలం విడుదలైన నాలుగు రోజుల్లోనే రూ.555 కోట్ల వసూళ్లు రాబట్టిన విషయం తెలిసిందే. తాజాగా 10 రోజుల్లో రూ.800 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ అధికారికంగా ప్రకటించింది.
దీంతో తెలుగు ఇండస్ట్రీలో రూ.800 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన చిత్రాలలో కల్కి మూడో సినిమాగా నిలిచింది. ఇంతకుముందు ఈ రికార్డు బాహుబలి 2, ఆర్ఆర్ఆర్ చిత్రాల పేరిటా ఉన్నాయి. మరోవైపు టికెట్లు రేట్లు తగ్గడంతో మూవీ కలెక్షన్లు మరింత పేరిగే అవకాశం ఉంది.
𝐓𝐇𝐄 𝐁𝐎𝐗 𝐎𝐅𝐅𝐈𝐂𝐄 𝐎𝐍 𝐅𝐈𝐑𝐄 🔥#EpicBlockbusterKalki in cinemas – https://t.co/z9EmiReie8#Kalki2898AD @SrBachchan @ikamalhaasan #Prabhas @deepikapadukone @nagashwin7 @DishPatani @Music_Santhosh @VyjayanthiFilms @Kalki2898AD @saregamaglobal @saregamasouth pic.twitter.com/MexQpSHlwI
— Kalki 2898 AD (@Kalki2898AD) July 6, 2024
నాగ్ అశ్విన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా.. వైజయంతీ మూవీస్ తెరకెక్కించిన ఈ మూవీలో బాలీవుడ్ భామలు దీపికా పదుకొనే, దిశా పటానీ ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటించగా… బెంగాలీ నటుడు శాశ్వత ఛటర్జీ విలన్‌గా నటించాడు. లెజెండరీ యాక్టర్లు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, రాజేంద్రప్రసాద్, పశుపతి ఇతర కీలక పాత్రలు పోషించారు.
ఇవి కూడా చదవండి..