Group-2 | సర్కారుకు నిరుద్యోగుల ఉద్యమ సెగ.. గ్రూప్-2 వాయిదా??
నిరుద్యోగుల ఉద్యమ సెగ సర్కారుకు గట్టిగానే తగిలినట్లుంది. ఇన్నాళ్లూ బెట్టుచేసిన రేవంత్ సర్కారు ఓ అడుగు దిగివచ్చింది. డీఎస్సీ లేదా గ్రూప్-2 (Group-2) పరీక్షల్లో ఏదో ఒకటి వాయిదా వేసే దిశగా ముందుకుపోతున్నది. అయితే గ్రూప్-2 పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తున్నది.
హైదరాబాద్: నిరుద్యోగుల ఉద్యమ సెగ సర్కారుకు గట్టిగానే తగిలినట్లుంది. ఇన్నాళ్లూ బెట్టుచేసిన రేవంత్ సర్కారు ఓ అడుగు దిగివచ్చింది. డీఎస్సీ లేదా గ్రూప్-2 (Group-2) పరీక్షల్లో ఏదో ఒకటి వాయిదా వేసే దిశగా ముందుకుపోతున్నది. అయితే గ్రూప్-2 పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తున్నది. ఇప్పటికే ఈ విషయం నిర్ణయం తీసుకున్నదని, నేడు దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుందని సమాచారం.
డీఎస్సీ, గ్రూప్-2 పరీక్షలు వెంటవెంటనే ఉన్నాయి. షెడ్యూల్ ప్రకారం జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ, ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలను నిర్వహించనున్నారు. అయితే ఇవి రెండూ ఒకదాని వెంటే మరొకటి నిర్వహిస్తుండడాన్ని అభ్యర్థులు వ్యతిరేకిస్తున్నారు. డీఎస్సీని సెప్టెంబర్లో నిర్వహించాలని గతకొంతకాలంగా డిమాండ్ చేస్తూవస్తున్నారు. ప్రభుత్వం నుంచి స్పందన కరువవడంతో.. డీఎస్సీ వాయిదా, గ్రూప్-1 మెయిన్స్తోపాటు పలు సమస్యల పరిష్కారానికి నిరుద్యోగులు శుక్రవారం టీఎస్పీఎస్సీ ముట్టడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్రెడ్డి శుక్రవారం నిర్వహించిన అత్యవసర సమావేశంలో పరీక్షల వాయిదా అంశంపై చర్చించినట్టు తెలిసింది. పరీక్షల తేదీల విషయంలో టీజీపీఎస్సీ, విద్యాశాఖతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని సమావేశంలో సీఎం ప్రకటించారు. ఈ నేపథ్యంలో గ్రూప్-2 వాయిదా వేయిదా వేయడానికే ప్రభుత్వం మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్ను.. సిక్కిం గవర్నర్గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

